Virat Kohli Afghanistan T20: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అఫ్గానిస్థాన్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అధికారికంగా ప్రకటించాడు. 'వ్యక్తిగత కారణాల వల్ల విరాట్, అఫ్గాన్‌తో తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు' అని ద్రవిడ్ పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్- అఫ్గానిస్థాన్ మధ్య జనవరి 11న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు మొహాలీ స్టేడియం వేదిక కానుంది.
-
India head coach Rahul Dravid says Virat Kohli will miss the first T20I against Afghanistan in Mohali due to personal reasons.#INDvsAFG pic.twitter.com/FJ61emN83W
— Press Trust of India (@PTI_News) January 10, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">India head coach Rahul Dravid says Virat Kohli will miss the first T20I against Afghanistan in Mohali due to personal reasons.#INDvsAFG pic.twitter.com/FJ61emN83W
— Press Trust of India (@PTI_News) January 10, 2024India head coach Rahul Dravid says Virat Kohli will miss the first T20I against Afghanistan in Mohali due to personal reasons.#INDvsAFG pic.twitter.com/FJ61emN83W
— Press Trust of India (@PTI_News) January 10, 2024
14 నెలల తర్వాత ఎంట్రీ! టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దాదాపు 14 నెలలు పొట్టి ఫార్మాట్ క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. వన్డే వరల్డ్‌కప్ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్న స్టార్ బ్యాటర్లు, తాజాగా టీ20 ల్లో ఆడేందుకు సిద్ధమైనట్లు బీసీసీఐకి తెలిపారు. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ అఫ్గాన్ సిరీస్‌కు వీరిద్దర్ని ఎంపిక చేసింది. దీంతో చాలా రోజుల తర్వాత రోహిత్, విరాట్‌ను టీ20ల్లో చూడనన్నామంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. అయితే విరాట్ తొలి మ్యాచ్‌కు దూరం కావడం వల్ల కాస్త నిరాశ చెందుతున్నారు.
భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ ఖాన్
Afghanistan Squad For India Series: అఫ్గానిస్థాన్ బోర్డు కూడా శనివారం జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌తో జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ టీ20ల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ జట్టుకు ఇబ్రహీమ్ జోర్డాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
అఫ్గానిస్థాన్ జట్టు: ఇబ్రహీమ్ జోర్డాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, హజ్మతుల్లా జజాయ్, అలిఖిల్, రహ్మత్ షా, మహ్మద్ నబీ, జర్డాన్, ఓమర్జాయ్, అష్రఫ్, ముజీబ్ రహ్మన్, ఫారుకీ, మాలిక్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, సలీమ్, అహ్మద్, నబీ, రషీద్ ఖాన్.
భారత్- అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యుల్:
- జనవరి 11 తొలి టీ20- మొహాలీ రాత్రి 7 గంటలకు
- జనవరి 14 రెండో టీ20- ఇందౌర్ రాత్రి 7 గంటలకు
- జనవరి 17 మూడో టీ20- బెంగళూరు రాత్రి 7 గంటలకు
భారత్ x అఫ్గాన్ - ఇంట్రెస్టింగ్గా ప్లేయింగ్ 11 - ఆడేదెవరు? ఆగేదెవరు?
టీ20ల్లో రోహిత్, విరాట్ రీ ఎంట్రీ- అఫ్గాన్ సిరీస్‌కు జట్టు ప్రకటన