ETV Bharat / sports

విజయ్​ దళపతి వర్సెస్​ ఇండియా పాక్​ మ్యాచ్‌.. ఈ రెండింటికి లింక్​ ఏంటబ్బా? - విజయ్​ తలపతి మీమ్స్​

తమిళ స్టార్ హీరో విజయ్​ వర్సెస్​ టీమ్​ఇండియా పాకిస్థాన్​ మ్యాచ్ ​అంటూ సోషల్​మీడియాలో బాగా ట్రెండ్​ అయింది. అసలు ఈ రెండింటికీ సంబంధం ఏమిటో తెలుసుకుందాం.

Vijay vs Teamindia pakisthan match
విజయ్​ వర్సెస్​ ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌
author img

By

Published : Sep 6, 2022, 10:05 AM IST

Vijay vs Teamindia pakisthan match సోషల్‌ మీడియా ప్రస్తుతం సమాజాన్ని బాగా ప్రభావితం అంశం. ముఖ్యంగా మీమ్స్​.. యువతను ఎక్కువగా ఆకర్షడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అసలు సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పేజీలదే హవా. అయితే మీమర్స్‌ తీసుకునే అంశాలు ఒక్కోసారి నెటిజన్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఏ విషయంలో ఎవరిని ట్రోల్‌ చేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.

తాజాగా ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్ జరిగిన రోజు కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్​ను కొందరు మీమర్స్‌ టార్గెట్‌ చేశారు. మీమర్స్‌ ఆ తమిళ స్టార్‌ హీరోను ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారనే విషయం తెలియక కొందరు నెటిజన్లు అయోమయానికి గురయ్యారు. అసలు విజయ్‌ను టార్గెట్‌ చేయడానికి కారణమేంటంటే.. గతంలో కొందరు తమిళ మీమర్స్‌ తెలుగు అగ్రకథానాయకుల్ని ట్రోల్‌ చేశారు. దీంతో కొందరు తెలుగు మీమర్స్‌ విజయ్‌ని టార్గెట్‌ చేశారు. మామూలు రోజుల్లో కంటే ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో ట్రోల్‌ చేస్తే మీమ్స్‌కు డిమాండ్‌ ఉంటుందని ఈ మీమర్స్‌ ఆలోచన. అందుకే ఇండియా మ్యాచ్‌ గెలిస్తే టీమిండియా పై మీమ్స్‌, ఇండియా ఓడిపోతే ఇళయదళపతిని ట్రోల్ చేయాలంటూ సోషల్‌ మీడియాలో అధికంగా మీమ్స్‌ కనిపించాయి.

సోషల్‌ మీడియాలో తమిళ, తెలుగు మీమర్స్‌ మధ్య హీరోల విషయంలో ఎప్పటినుంచో కోల్డ్‌ వార్‌ జరుగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితి కాస్త వెరైటీగా ఉండటంతో నెటిజన్లు 'విజయ్‌ను ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారు?' అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మీమర్స్‌ మాత్రం 'ఊరికే' 'సరదాగా' అంటూ ముక్తసరి జవాబులతో సరిపెట్టి మరింత హైప్‌ను పెంచుకుంటున్నారు.

ఇదీ చూడండి: సంతోషంగా జీవించడం ఎలాగో చెబుతున్న మలయాళీ ముద్దుగుమ్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.