ETV Bharat / sports

'వంద మైళ్ల వేగంతో బంతులు వేస్తా.. అక్తర్‌ రికార్డును బద్దలు కొట్టేస్తా' - పాకిస్థాన్​ ప్లేయర్​ షోయబ్‌ అక్తర్‌

స్పీడ్‌తో పాటు సరైన లెంగ్త్‌తో బంతి పడితే ఎంతటి బ్యాటర్‌కైనా ఆడటం కష్టం. అయితే పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ మాత్రం ఇలా ఎంతో మంది బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అయితే లెంగ్త్‌ మిస్‌ అయినప్పుడు ధారాళంగా పరుగులు సమర్పించేవాడు. అయితే అక్తర్‌ ఫాస్ట్‌ రికార్డును అధిగమిస్తానని ఓ భారత బౌలర్ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. అతను ఎవరంటే..

indian pacer umran mallik
indian pacer umran mallik
author img

By

Published : Jan 3, 2023, 12:06 PM IST

షోయబ్‌ అక్తర్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ బాల్‌ను సంధించిన మాజీ బౌలర్‌. దాదాపు వంద మైళ్ల వేగంతో బంతిని విసిరి అబ్బురపరిచాడు. 2003 ప్రపంచకప్‌ సందర్భంగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 161.3 కి.మీ వేగంతో బౌలింగ్‌ చేసి ఈ ఫీట్‌ను సాధించాడు. ఇప్పటి వరకు ఆ రికార్డును ఎవరూ అధికారికంగా బ్రేక్ చేయలేదు. కానీ టీమ్‌ఇండియా యువ పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌ మాత్రం అక్తర్‌ స్పీడ్‌ను దాటేస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికైన ఉమ్రాన్‌ ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

ప్రస్తుతం భారత్ తరఫున ఉత్తమంగా రాణించడంపైనే దృష్టిపెట్టానని, అదృష్టం కలిసొస్తే.. తప్పకుండా అక్తర్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేస్తానని మాలిక్ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ చెప్పాడు. "అత్యుత్తమంగా బౌలింగ్‌ చేయడంపైనే నా దృష్టి. ఒకవేళ అదృష్టం కలిసి వస్తే మాత్రం అత్యంత వేగవంతమైన బంతి వేసిన అక్తర్‌ రికార్డును బద్దలు కొడతా. అయితే ఇప్పుడేమీ దాని గురించి ఆలోచించడం లేదు. భారత్ తరఫున మంచి ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టిసారించా. మ్యాచ్‌ జరిగేటప్పుడు ఎంత వేగంతో బంతిని వేస్తున్నామో ఆలోచించం. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఎలా వేశామనే దానిని చూసుకొంటేనే తెలుస్తుంది. అంతేకానీ మ్యాచ్‌ ఆడేటప్పుడు మా దృష్టంతా బౌలింగ్‌పైనే ఉంటుంది కానీ.. స్పీడ్‌ ఎంత వేస్తున్నామనేది పట్టించుకోం" అని ఉమ్రాన్‌ మాలిక్‌ వెల్లడించాడు.

అంతర్జాతీయ కెరీర్‌లో ఉమ్రాన్ మాలిక్‌ అత్యంత వేగవంతమైన బంతిని న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా విసిరాడు. కివీస్‌ బ్యాటర్ డారిల్‌ మిచెల్‌కు వేసిన బంతి 153.1 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. అయితే ఐపీఎల్‌లో అంతకంటే ఎక్కువ స్పీడ్‌తో బంతిని వేశాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 157 కి.మీ వేగంతో (97.55 మైళ్లు) బంతిని విసిరి రికార్డు సృష్టించాడు. షోయబ్‌ అక్తర్‌ స్పీడ్ రికార్డును అధిగమించే సత్తా ఉమ్రాన్‌కు ఉందని అప్పుడే నిరూపించుకొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.