ETV Bharat / sports

ఇకపై వారికి క్రికెట్​లో నో ఛాన్స్! - పూర్తిగా నిషేధించిన ఐసీసీ - Woman Umpire In Cricket Equal Pay

Transgenders Ban In Womens Cricket : లింగ మార్పిడి ద్వారా స్త్రీలుగా మారిన వారిని మహిళల అంతర్జాతీయ క్రికెట్​లో ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. క్రికెట్​లో మహిళల సమగ్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ చెప్పింది.

Transgenders Ban In Womens Cricket
Transgenders Ban In Womens Cricket
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 9:13 AM IST

Updated : Nov 22, 2023, 9:41 AM IST

Transgenders Ban In Womens Cricket : అంతర్జాతీయ క్రికెట్​లో కొత్త మార్పులకు ఐసీసీ శ్రీకారం చూడుతోంది. పురుష అంపైర్లతో సమానంగా మహిళా అంపైర్లకు వేతనం ఇవ్వాలని ఐసీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. మహిళల క్రికెట్‌ న్యాయబద్ధతను కాపాడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఐసీసీ. అబ్బాయిలు లింగ మార్పిడి ద్వారా పూర్తిగా అమ్మాయిగా మారి, గుర్తింపు పొందినప్పటికీ మహిళల క్రికెట్ (అంతర్జాతీయ)​లో ఆడకుండా వారిపై నిషేధం విధించింది.

అయితే ప్లేయర్ల భద్రత కోసమే మంగళవారం జరిగిన బోర్డు మీటింగ్​లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ చెప్పింది. ఈ క్రమంలో '9 నెలల పాటు విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిబంధన తీసుకొచ్చాం' అని ఐసీసీ సీఈవో అలర్​డైస్ తెలిపారు. అయితే డొమెస్టిక్​ క్రికెట్​ లీగ్​ల్లో మాత్రం ఈ నిబంధనపై తుది నిర్ణయం ఆయా దేశాలదేనని స్పష్టం చేశారు.

  • 🏏Cricket governing body issues worldwide BAN on transgender males competing in international Women’s Cricket competitions.

    The ICC has banned all biological men from competing in the female category regardless of any gender reassignment surgeries, hormones or puberty… pic.twitter.com/B7gS4zVPBh

    — Oli London (@OliLondonTV) November 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తొలి ట్రాన్స్​జెండర్ క్రికెటర్.. కెనడాకు చెందిన డానియల్ మెక్​గహే అంతర్జాతీయ మహిళల క్రికెట్​లో ఆడిన తొలి ట్రాన్స్​జెండర్. ఆమె ఇదే ఏడాది సెప్టెంబర్​లో తొలి మ్యాచ్​ ఆడింది. 2024 టీ20 వరల్డ్​కప్ క్వాలిఫయర్​ టోర్నీలో మక్​గహే కెనడా తరపున ప్రాతినిధ్యం వహించింది. ఈ లీగ్​లో ఆమె 6 మ్యాచ్​ల్లో 118 పరుగులు చేసింది. ఇక ఐసీసీ తాజా నిబంధన పట్ల మక్​గహే విచారం వ్యక్త పరిచింది. ' ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో నా గుండె బరువెక్కింది. ఇక నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది. నా జర్నీలో మద్దతుగా నిలిచిన టీమ్​మేట్స్​, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు' అని మెక్​గహే సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

Woman Umpire In Cricket Equal Pay : పురుష అంపైర్లతో సమానంగా మహిళ అంపైర్లకు సమాన వేతనం ప్రకటిస్తూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది ఐసీసీ. వారు పురుషులు లేదా మహిళల మ్యాచ్​లకు అంపైర్లుగా వ్యవహరించినా సమాన వేతనం ఉంటుందని తెలిపింది. ఈ సమాన వేతనాన్ని 2024 జనవరి నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సంచలనాత్మక నిర్ణయం.. క్రికెట్‌లో లింగ సమానత్వం పట్ల ఐసీసీకి ఉన్న నిబద్ధతను సూచిస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది.

భారత్​తో అఫ్గాన్​ తొలి ద్వైపాక్షిక సిరీస్​- టీమ్ఇండియా నెక్స్ట్​ టార్గెట్ అదే!

ఫ్యాన్స్​ అందరికీ సేమ్​ డౌట్!- రోహిత్-విరాట్​ గమనం ఎటో?

Last Updated : Nov 22, 2023, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.