ETV Bharat / sports

Top Sixes In World Cup History : వరల్డ్​కప్​లో సిక్సర్ల వీరులు.. టాప్​లో 'క్రిస్ గేల్'.. నెక్ట్స్​ ఎవరున్నారంటే - ఏబీ డివిలియర్స్ ప్రపంచకప్ సిక్స్​లు

Top Sixes In World Cup History : ప్రపంచకప్​ చరిత్రలో ఇప్పటివరకూ అత్యధిక సిక్స్​లు బాదిన టాప్-5 ప్లేయర్లెవరో తెలుసుకుందాం.

Top Sixes In World Cup History
Top Sixes In World Cup History
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 9:01 PM IST

Top Sixes In World Cup History : 2023 వరల్డ్​కప్​నకు మరో 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ మెగాటోర్నీలో జరిగే పోటీలను వీక్షించేందుకు యావత్ ప్రపంచంలోని క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక అక్టోబర్ 5న ప్రారంభమయ్యే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి నవంబర్ 17న తెరపడనుంది. విశ్వకప్​ను గెలుచుకునేందుకు పది జట్లు పోటీలో ఉండనున్నాయి. అయితే ఆయా జట్ల ఆటగాళ్లు ​వరల్డ్​కప్​లో రాణించి తమ సత్తా చాటాలనుకుంటారు. ఈ క్రమంలో కొందరు ప్లేయర్లు సిక్సర్ల వర్షం కురిపించి.. తమతమ జట్లకు ఘన విజయాన్ని కట్టబెట్టారు. మరి ప్రపంచకప్​ హిస్టరీలో అత్యధిక సిక్స్​లు బాదిన టాప్​-5 హిట్టర్​లు ఎవరో తెలుసుకుందాం.

  1. క్రిస్ గేల్: భీకరమైన ఆట తీరుతో యూనివర్సల్ బాస్​గా పేరొందాడు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్. ఫార్మాట్ ఏదైనా తన స్టైల్​లో బ్యాటింగ్ చేస్తూ.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అలాగే తన కెరీర్​లో 2003 నుంచి 2019 ప్రపంచకప్ ఆయా ఎడిషన్​లలో 45 మ్యాచ్​లు ఆడాడు. ఇందులో గేల్ 49 సిక్సర్లు బాది.. ఈ లిస్ట్​లో టాప్​ ప్లేస్​లో ఉన్నాడు. ఇక 34 ఇన్నింగ్స్​లో గేల్ 1186 పరుగులు చేశాడు.
  2. ఏబీ డివిలియర్స్ : సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్.. 37 సిక్సర్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. డివిలియర్స్.. 2007 నుంచి 2015 వరకు 23 మ్యాచ్​ల్లో 117 స్ట్రైక్ రేట్‌తో 1207 పరుగులు చేశాడు.
  3. రికీ పాంటింగ్ : ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్.. మోస్ట్ సక్సెస్​ఫుల్ కెప్టెన్​గా పేరొందాడు. కెప్టెన్​గానే కాకుండా బ్యాటర్​గానూ జట్టకు అనేక విజయాలు కట్టబెట్టాడు. ఈ క్రమంలో పాంటింగ్ వరల్డ్ కప్​ హిస్టరీలో 31 సిక్సర్లు బాది.. ఈ లిస్ట్​లో ముడో ప్లేస్​లో కొనసాగుతున్నాడు. ఇక అత్యధికంగా 1996 నుంచి 2011 వరకూ 5 వరల్డ్​కప్ ఎడిషన్లలో ఆసీస్​కు ప్రాతినిధ్యం వహించిన పాటింగ్.. 79.95 స్ట్రైక్ రేట్‌తో 1743 పరుగులు చేశాడు.
  4. బ్రెండన్ మెకల్లమ్.. న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ ప్రపంచకప్ చరిత్రలో 29 సిక్సర్లు బాదాడు. దీంతో టాప్​ 5లో నాలుగో స్థానంలో ఉన్నాడు. 2003 నుంచి 2015 వరకూ ప్రపంచకప్​ల్లో 34 మ్యాచ్​లు ఆడిన మెకల్లమ్.. 120.84 రన్ రేట్‌తో 742 పరుగులు చేశాడు
  5. హర్షల్ గిబ్స్ : దక్షిణాఫ్రికా మాజీ ఓపెనింగ్ బ్యాటర్ హర్షల్ గిబ్స్ మెగాటోర్నీలో 28 సిక్సర్లు సంధించాడు. ఈ క్రమంలో గిబ్స్.. ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 1999 నుంచి 2007 మధ్య ప్రపంచకప్​లో 24 మ్యాచ్‌లు ఆడిన గిబ్స్.. 1067 పరుగులు చేశాడు.

​World Cup 2023 : భారీ లేజర్ లైట్ షో - డీజే సెటప్​తో ఓపెనింగ్ ఈవెంట్​.. సినీ సెలబ్రిటీలు ఎవరు వస్తున్నారంటే?

ODI World Cup 2023 England Team : ఫేవరెట్​గా డిఫెండింగ్​ ఛాంపియన్​.. అదొక్కటే మైనస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.