ETV Bharat / sports

బీచ్​లో సిక్స్​ప్యాక్‌ బాడీలతో టీమ్​ఇండియా క్రికెటర్లు.. వీడియో వైరల్ - newzealand team india

ప్రస్తుతం న్యూజిలాండ్​ పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా క్రికెటర్లు.. ప్రపంచకప్ చేదు అనుభవాలను అధిగమించి కివీస్​తో జరగనున్న సిరీస్​లను నెగ్గాలని చూస్తున్నారు. అందుకోసం ప్రాక్టీస్​లో మునిగితేలుతున్నారు. ఖాళీ సమయాల్లో బీచ్​లో ఎంజాయ్​ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. మీరూ ఓ సారి చూసేయండి.

team india cricketers flaunt abs beach wellington ahead 1st t20 vs nz

author img

By

Published : Nov 17, 2022, 1:01 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2022 సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో పరాభవం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన టీమ్​ఇండియా.. రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్‌ పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న భారత్‌.. వరల్డ్‌కప్‌ చేదు అనుభవాలను అధిగమించి అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో శుక్రవారం జరగబోయే తొలి టీ20కి వేదిక అయిన వెల్లింగ్టన్‌కు చేరుకున్న టీమ్​ఇండియా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది.

ప్రాక్టీస్‌లో పాల్గొన్న యువ భారత ఆటగాళ్లు ఎంతో హుషారుగా, ఆత్మవిశ్వాసంతో కనిపించారు. మధ్యలో దొరికిన కొద్దిపాటి ఖాళీ సమయంలో బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ సేద తీరారు. హార్దిక్​ పాండ్య, శ్రేయస్‌ అయ్యర్‌, అర్షదీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లు సిక్స్‌ ప్యాక్‌ బాడీలతో బీచ్‌ నుంచి బయటికి వస్తున్న వీడియోను వాషింగ్టన్‌ సుం‍దర్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

అయితే వీడియో చూసిన అభిమానులు రకరకాలుగా రియాక్ట్‌ అవుతున్నారు. కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే, మరికొందరు నెగిటివ్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో.. ఫిట్‌నెస్‌ విషయంలో శ్రద్ధ తీసుకునే భారత క్రికెటర్లు.. న్యూజిలాండ్‌పై గెలిచేందుకు కూడా అంతే శ్రద్ధతో కృషి చేయాలని సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.