ETV Bharat / sports

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆసీస్‌కు షాక్‌.. కివీస్‌ గెలుపు - టీ20 ప్రపంచకప్​ 2022

డిఫెండింగ్‌ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్‌.. టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ -12 తొలి మ్యాచ్‌ ఓటమితో ఆహ్వానం పలికింది.

T20 worldcup match
డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆసీస్‌కు షాక్‌.. కివీస్‌ గెలుపు
author img

By

Published : Oct 22, 2022, 5:26 PM IST

టీ20 వరల్డ్ కప్​లో డిఫెండింగ్ ఛాపింయన్ ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్ షాకిచ్చింది. గత ఏడాది జరిగిన ఫైనల్లో ఓటిమికి కివీస్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ అన్ని విభాగాల్లో రాణించి 89 తేడాతో భారీ విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 200/3 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్‌ 17.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (28) టాప్‌ స్కోరర్‌. ప్యాట్ కమిన్స్‌ 21, ఆరోన్ ఫించ్‌ 3, మిచెల్ మార్ష్ 13, టిమ్ డేవిడ్ 11, డేవిడ్ వార్నర్ 5, మార్కస్ స్టొయినిస్‌ 7, మిచెల్ స్టార్క్ 4 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 3, మిచెల్ సాంట్నర్ 3, ట్రెంట్ బౌల్ట్‌ 2.. ఐష్ సోధి, లాకీ ఫెర్గూసన్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో కివీస్‌ గ్రూప్‌ -1లో 2 పాయింట్లతో (+4.450) మంచి నెట్‌రన్‌రేట్ సాధించింది.

అదరగొట్టిన ఓపెనర్లు.. ఆసీస్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు బౌలర్లను ఎదుర్కోవడం సులువేం కాదు. కానీ సూపర్‌ -12 తొలి మ్యాచ్‌లో కివీస్‌ ఓపెనర్లు అదరగొట్టేశారు. ఓపెనర్ ఫిన్ అలెన్ (42: 16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీ రికార్డు సాధిస్తాడని భావించినా.. హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. అలెన్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్‌ (23)తో కలిసి కాన్వే (92*: 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ కలిసి 69 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే విలియమ్సన్‌తోపాటు గ్లెన్‌ ఫిలిప్స్ (12) ఔట్‌ కావడంతో పరుగుల వేగం తగ్గిందని భావించినా.. ఆల్‌రౌండర్ నీషమ్ (26 నాటౌట్: 13 బంతుల్లో 2 సిక్స్‌లు) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో జట్టు స్కోరు 200 మార్క్‌ను తాకింది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్ 2, జంపా ఒక వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి: టీ20 ప్రపంచకప్​పై ధోనీ ఫన్నీ రెస్పాన్స్​.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.