టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో భారత్ దూకుడుగా ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసి 179/2 స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 రన్స్‌తో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ (62*: 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (51*: 25 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధశతకాలతో అదరగొట్టారు. కేఎల్ రాహుల్ (9) మరోసారి నిరాశపరిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో క్లాసెన్ , మీకెరెన్ చెరో వికెట్ తీశారు.
హిట్‌మ్యాన్ రికార్డు.. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఘనత సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బాదిన భారత క్రికెటర్‌గా రోహిత్ రికార్డుకెక్కాడు. తాజా మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన రోహిత్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ఓవరాల్‌గా 34 సిక్సర్లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్(34) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో యువీ రికార్డును హిట్ మ్యాన్ బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రిస్ గేల్(63) ఉన్నాడు.
అదే విధంగా ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ మరో రికార్డును అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇప్పటి వరకు పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్ 903 పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే 1016 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ.. 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 53 పరుగులు సాధించాడు.
ఇదీ చూడండి: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇకపై మహిళా క్రికెటర్లకూ..