ETV Bharat / sports

T20 worldcup: టీమ్​ఇండియాకు తప్పిన టెన్షన్​.. అలా చేస్తే సెమీస్​ బెర్త్​ ఖాయం! - టీ20 ప్రపంచకప్​ 2022 టీమ్​ఇండియా సెమీఫైనల్

జింబాబ్వేపై సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరింది. అయితే ఈ మ్యాచ్ రద్దు కావడం సౌతాఫ్రికాకు ఇబ్బందికరంగా మారనుండగా.. భారత్​కు మాత్రం కలిసొచ్చింది. ఎలా అంటే?

.
.
author img

By

Published : Oct 25, 2022, 10:00 AM IST

టీ20 ప్రపంచకప్ 2022లో టీమ్​ఇండియాకు పెద్ద టెన్షన్ తప్పింది. పాకిస్థాన్‌పై సాధించిన అద్భుత విజయంతో పాటు వర్షం కారణంగా దక్షిణాఫ్రికాకు చేజారిన గెలుపుతో భారత జట్టుకు సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి. చిన్న జట్లపై విజయం సాధిస్తే.. రోహిత్ సేన సెమీస్‌కు దూసుకెళ్తోంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్ జట్లతో ఉన్న టీమ్​ఇండియా.. ఒక విజయంతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది.

టీమ్​ఇండియాకు గట్టి పోటీనిచ్చే జట్లు పాకిస్థాన్, సౌతాఫ్రికా మాత్రమే. అలా అని మిగతా జట్లను తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు కానీ భారత జట్టు స్థాయికి పోటీ ఇవ్వలేనివి. ప్రధాన జట్లలో ఇప్పటికే పాకిస్థాన్‌ను ఓడించిన టీమ్​ఇండియా.. సౌతాఫ్రికాతో ఓడినా సెమీస్ అవకాశాలకు వచ్చే నష్టమేమిలేదు. ఇతర చిన్న జట్లు అయిన బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్‌ను ఓడిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఇక ఈ మూడు మ్యాచ్‌ల్లో భారత్ భారీ తేడాతో గెలిస్తే నెట్ రన్‌రేట్‌కు కూడా ఢోకా ఉండదు.

పాకిస్థాన్​ వర్సెస్​ సౌతాఫ్రికా.. అయితే దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలవకపోవడం.. భారత్​కు కలిసొచ్చినా పాకిస్థాన్‌కు అలాంటిదేమి లేదు. పాక్​ సెమీఫైనల్ చేరాలంటే సౌతాఫ్రికాతోపాటు మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలి. కాబట్టి సిడ్నీ వేదికగా నవంబర్ 3న దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌ను దాదాపుగా క్వార్టర్‌ ఫైనల్‌గా పరిగణించొచ్చు. పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలవాలంటే.. సౌతాఫ్రికాను భారత్ ఓడించడం కూడా కీలకం కానుంది.

వర్షం కారణంగా.. ఎందుకంటే జింబాబ్వేతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయాన్ని వరణుడు లాగేసాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దవ్వడం వల్ల చెరొక పాయింట్ కేటాయించారు. దీంతో సౌతాఫ్రికాకు మిగతా మ్యాచ్‌లన్నీ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం 1.30కు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కాస్త బ్రేక్ ఇవ్వడంతో మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించి ప్రారంభించారు. ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 9 ఓవర్లలో 5 వికెట్లకు 79 పరుగులు చేసింది.

వెస్లీ మధెవెరె(35*) ధాటిగా ఆడగా.. మిల్టన్ షుంబా(18*) అండగా నిలిచాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా.. అన్రిచ్ నోర్జే, వ్యాన్ పార్నెల్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. డికాక్ తొలి బంతి నుంచే హిట్టింగ్‌కు దిగాడు. వరుసగా ఐదు బంతులను 4, 4, 4, 6, 4 బౌండరీలకు తరలించాడు.

చివరి బంతికి సింగిల్ తీసి 23 పరుగులు పిండుకున్నాడు. రెండో ఓవర్‌లో ఓ బంతి వేయగానే మళ్లీ వర్షం ప్రారంభమైంది. కొద్దిసేపటి తర్వాత వర్షం ఆగిపోవడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించి ఆటను తిరిగి ప్రారంభించారు. మరో రెండు ఓవర్ల ఆటను కుదించి 7 ఓవర్లలో సౌతాఫ్రికా టార్గెట్‌ను 64గా నిర్ణయించారు. ఆ తర్వాత కూడా డికాక్ తన జోరును కొనసాగించాడు. రెండో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలతో మొత్తం నాలుగు ఫోర్లు కొట్టిన అతను రెండో ఓవర్‌లో జట్టు స్కోర్‌ను 40 ధాటించాడు. ఆ తర్వాత మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

ఇదీ చూడండి: కోహ్లీ 'నో బాల్' వివాదం​.. పాక్​ మాజీలు సెటైర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.