టీ20 వరల్డ్‌కప్ 2022లో భాగంగా టీమ్‌ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా మరి కాసేపట్లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముంపు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరించింది. అడిలైడ్, పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం కురిసిందని చెప్పింది. మధ్యాహ్నం కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ అభిమానులకు ఈ వార్త అస్సలు సహించడం లేదు.
ఎందుకంటే.. ఒక వేళ వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ రద్దైతే, రిజ్వర్ డేలో మ్యాచ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ అప్పుడు కూడా సాధ్యపడకపోతే.. గ్రూప్ దశలో టాపర్‌గా ఉన్న జట్టును (భారత్) విజేతగా ప్రకటిస్తారు. ఇప్పుడిదే విషయం ఇంగ్లాండ్ జట్టును, ఆ దేశ అభిమానులను కలవరపెడుతోంది.
చాహాల్‌ను తీసుకొస్తారా?.. ఈ కీలక సెమీస్ పోరులో రోహిత్ సేన ఇంగ్లాండ్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు భారత జట్టులో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్ స్థానంలో స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ను తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
పిచ్ పరిస్థితులను బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుందని టీమ్‌ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. సెమీస్ జరిగే అడిలైడ్ ఓవల్ పిచ్ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో అక్షర్ స్థానంలో చాహల్‌ను ఆడించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక దినేశ్ కార్తిక్, రిషభ్ పంత్.. ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ టోర్నీలో దినేశ్ కార్తిక్ అంచనాలను అందుకోవడంలో విఫలమవడంతో.. గత మ్యాచ్‌లో పంత్‌కు అవకాశం కల్పించారు. అయితే, జింబాబ్వే మ్యాచ్‌లో పంత్ కూడా ఆశించినంత మేర రాణించలేదు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనే దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే పంత్‌ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇక ఈ పిచ్‌పై లక్ష్య ఛేదనలోనే 40శాతం విజయావకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: గోవా బీచ్‌లో సచిన్ సందడి.. మత్స్యకారులతో కలిసి చేపలు పడుతూ..