Natarajan Cricket Ground: టీమ్ఇండియా యువ పేసర్ నటరాజన్ జాతీయ జట్టులో అరంగేట్రం చేసి ఏడాది పూర్తి కావొస్తోంది. 2020-21లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్ ఆడిన నటరాజన్.. తర్వాత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడాడు. ఈ సందర్భంగా సొంతూల్లో క్రికెట్ మైదానం ఏర్పాటు చేయాలనే కలను నిజం చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు నటరాజన్. దీనికి సంబంధించి ఓ తాజాగా ఓ ట్వీట్ చేశాడు.
భారత్ తరఫున అన్ని ఫార్మాట్లు ఆడటంపై హర్షం వ్యక్తం చేసిన నటరాజన్.. తన సొంతూల్లో ఏర్పాటు చేసిన మైదానం పేరు 'నటరాజన్ క్రికెట్ గ్రౌండ్' అని తెలిపాడు.
"సొంత ఊరిలో అన్ని సౌకర్యాలు ఉండేలా క్రికెట్ మైదానం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఈ మైదానానికి నటరాజన్ క్రికెట్ గ్రౌండ్(ఎన్సీజీ) అని పేరు పెడతాం. గతేడాది డిసెంబర్లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేశా. ఈ ఏడాది డిసెంబర్లో మైదానం కడుతున్నా." అని ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపాడు యువ పేసర్ నటరాజన్. కలలు తప్పకుండా నిజమవుతాయని తెలిపాడు. క్రికెట్ మైదానం ఫొటోలను షేర్ చేశాడు.
-
Happy to Announce that am setting up a new cricket ground with all the facilities in my village, Will be named as *NATARAJAN CRICKET GROUND(NCG)❤️
— Natarajan (@Natarajan_91) December 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
* #DreamsDoComeTrue🎈Last year December I Made my debut for India, This year (December) am setting up a cricket ground💥❤️ #ThankGod pic.twitter.com/OdCO7AeEsZ
">Happy to Announce that am setting up a new cricket ground with all the facilities in my village, Will be named as *NATARAJAN CRICKET GROUND(NCG)❤️
— Natarajan (@Natarajan_91) December 15, 2021
* #DreamsDoComeTrue🎈Last year December I Made my debut for India, This year (December) am setting up a cricket ground💥❤️ #ThankGod pic.twitter.com/OdCO7AeEsZHappy to Announce that am setting up a new cricket ground with all the facilities in my village, Will be named as *NATARAJAN CRICKET GROUND(NCG)❤️
— Natarajan (@Natarajan_91) December 15, 2021
* #DreamsDoComeTrue🎈Last year December I Made my debut for India, This year (December) am setting up a cricket ground💥❤️ #ThankGod pic.twitter.com/OdCO7AeEsZ
ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన నటరాజన్ అనేకసార్లు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా నటరాజన్‌పై ప్రశంసలు కురిపించాడు.
భారత్ తరఫున ఓ టెస్టు, రెండు వన్డేలు, నాలుగు టీ20లు ఆడిన నటరాజన్ 13 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు జట్టు తరఫున ఆడాడు.
ఇదీ చదవండి:
ముదురుతున్న టీమ్ఇండియా వన్డే కెప్టెన్సీ వ్యవహారం..
Ashes 2nd test 2021: జట్టులోకి అండర్సన్.. ఇంగ్లాండ్ టీమ్ ఇదే