IPL Auction 2022: టీమ్ఇండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఐపీఎల్ మెగావేలంలో రికార్డు ధరకు కొనుగోలు చేసింది కోల్‌కతా నైట్‌రైడర్స్. అతడి కోసం దిల్లీ కూడా పోటీ పడగా, వేలం హోరాహోరీగా సాగింది. కెప్టెన్ అవసరం ఉన్న కోల్‌కతా.. ఎట్టకేలకు రూ.12.25 కోట్లు చెల్లించి మరీ అయ్యర్‌ను సొంతం చేసుకుంది.
దిల్లీ క్యాపిటల్స్‌ను 2020 సీజన్‌లో ఫైనల్‌కు చేర్చిన సారథి.. శ్రేయస్ అయ్యర్. పద్నాలుగో సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు.. కేవలం 175 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్సీని కోల్పోవడం సహా సగం మ్యాచ్‌లు కూడా ఆడలేదు. ఒకానొక దశలో కొత్త ఫ్రాంచైజీలు ఎంచుకుని నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తాయని అంతా భావించారు. అయితే అలాంటిందేమీ జరగకపోవడం వల్ల మెగా వేలంలోకి వచ్చేశాడు. వరుసగా నాలుగేళ్లపాటు రూ. 7 కోట్లతో దిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
భారత ఓపెనర్ శిఖర్ ధావన్, దక్షిణాఫ్రికా పేసర్ రబాడకు కూడా వేలంలో భారీ ధర..
శిఖర్ ధావన్: ఫామ్‌లో ఉంటే ఎంత భీకరంగా ఆడతాడో పద్నాలుగో ఐపీఎల్ సీజన్‌లో చూశాం. అత్యధిక పరుగు వీరుల జాబితాలో ధావన్ (587) నాలుగో స్థానంలో ఉన్నాడు. దిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి రూ. 5.2 కోట్లకు ధావన్‌ను దిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. వరుసగా మూడేళ్లు 500కిపైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే అతడిని రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.
- కగిసో రబాడ - రూ. 9.25 కోట్లు- పంజాబ్ కింగ్స్
- న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్- రూ. 8కోట్లు- రాజస్థాన్
- ప్యాట్ కమిన్స్- రూ.7.25 కోట్లు- కోల్‌కతా
- డుప్లెసిస్- రూ.7 కోట్లు- బెంగళూరు
- డికాక్- రూ. 6.75 కోట్లు- లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
- మహ్మద్ షమి- రూ. 6.25 కోట్లు- గుజరాత్ టైటాన్స్
ఇదీ చూడండి: IPL 2022 Auction: సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎవరిని తీసుకుంటే మంచిదంటే?