ETV Bharat / sports

ఇంజినీరింగ్‌ వదిలేసి.. ఐపీఎల్​లో సత్తా చాటి.. అంతర్జాతీయ క్రికెట్లో 'షాబాజ్​' అరంగేట్రం! - షాబాజ్‌ అహ్మద్​ క్రికెట్​ కెరీర్​

తాత హెడ్​ మాస్టర్‌.. నాన్న ప్రభుత్వ ఉద్యోగి.. అన్న ఉపాధ్యాయుడు.. సోదరి వైద్యురాలు! ఇలా షాబాజ్‌ అహ్మద్‌ ఇంట్లో అంతా విద్యాధికులే! అతడు కూడా తక్కువేం కాదు పదో తరగతిలో 80 శాతం.. ఇంటర్‌లో 88 శాతం మార్కులు.. ఇంజినీర్‌ కావాలన్నది కల! అక్కడ కట్‌ చేస్తే.. భారత క్రికెట్‌ జెర్సీలో షాబాజ్‌! దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం!

shahbaz ahmed
shahbaz ahmed
author img

By

Published : Oct 10, 2022, 8:14 AM IST

Shahbaz Ahmed: హరియాణాలోని పవ్వాల్‌కు చెందిన షాబాజ్‌ దేశవాళీలో స్థిరంగా రాణించి భారత జట్టు తలుపు తట్టాడు. అసలు భారత జట్టులో చోటు దక్కించుకోవడం 27 ఏళ్ల షాబాజ్‌కు ఓ కల లాంటిదే. ఎందుకంటే అతడు ఆరంభంలో ఎంచుకున్న మార్గం వేరు.. నడిచిన బాట వేరు. అందరిలాగే షాబాజ్‌ను కూడా బాగా చదివించాలని అతడి తండ్రి అహ్మద్‌ జాన్‌ ఆశించాడు.

క్రికెట్‌ మాయలో పడి షాబాజ్‌ కళాశాలకు డుమ్మా కొట్టేవాడు. ఇంజినీరింగ్‌లో నెలల తరబడి క్లాసులకు వెళ్లేవాడే కాదు. అతడిపై ప్రొఫెసర్లు తల్లిదండ్రులకు ఫిర్యాదులు చేస్తే గానీ తెలియలేదు షాబాజ్‌ క్రికెట్‌ను ఎంతగా ఇష్టపడుతున్నాడో! అప్పటికే రెండేళ్లు హరియాణా అండర్‌-19 శిబిరంలో పాల్గొన్నాడు ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌.

తనయుడి ఆసక్తిని గమనించిన తండ్రి తనకు ఇష్టం లేకున్నా క్రికెట్‌ ఆడేందుకు అనుమతి ఇచ్చాడు. అక్కడి నుంచి పూర్తిగా క్రికెట్‌పై దృష్టిసారించాడు షాబాజ్‌. మాజీ బెంగాల్‌ క్రికెటర్‌ ప్రమోద్‌ చండీలా ప్రోత్సాహంతో హరియాణాకు చాలా దూరంలో ఉన్న కోల్‌కతాకు మెరుగైన కోచింగ్‌ కోసం వెళ్లాడు. ఇతర క్రికెటర్లతో కలిసి చాలీ చాలని గదిలో ఉంటూ స్థానిక తపన్‌ క్రికెట్‌ అకాడమీలో చేరాడు. అక్కడ రాటుదేలిన అతడు.. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి దృష్టిలో పడి బెంగాల్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

2019-20 సీజన్లో రంజీ ట్రోఫీలో జట్టును ఫైనల్‌ చేర్చడంలో షాబాజ్‌ కీలకపాత్ర పోషించాడు. అదే ఏడాది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన షాబాజ్‌.. వరుసగా మూడేళ్లు ఆ జట్టుకు ఆడాడు. ఆర్సీబీ తరఫున ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆల్‌రౌండ్‌ సత్తా చాటడం, దేశవాళీల్లోనూ రాణించడంతో అతడికి ఇప్పుడు భారత జట్టులో చోటు దక్కింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.