Sara Tendulkar on Deep Fake : క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమార్తె సారా తెందూల్కర్ సైతం డీప్‌ఫేక్ బారిన పడింది. తన డీప్‌ఫేక్ వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని సారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఎక్స్(ట్విట్టర్)లో తన పేరుతో కొంతమంది నకిలీ ఖాతాలు తెరిచారని తెలిపారు. కొందరు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని, అది సరికాదని పేర్కొన్నారు.
"మన రోజువారీ కార్యకలాపాలు, ఆనందాలు, బాధలను పంచుకునేందుకు సామాజిక మాధ్యమం అద్భుతమైన వేదిక. కానీ, కొందరు సాంకేతికతను దుర్వినియోగం చేయడం కలవరపెడుతోంది. సామాజిక మాధ్యమాల్లో నా డీప్‌ఫేక్ ఫొటోలు కూడా వైరల్ అవడం చూశా. ఇక, ఎక్స్ (ట్విట్టర్)లో కొందరు కావాలనే నా పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి.. నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. నాకు ఎక్స్‌లో అసలు ఖాతానే లేదు. అలాంటి నకిలీ ఖాతాలను ఎక్స్ గుర్తించి, వాటిని సస్పెండ్ చేస్తుందని ఆశిస్తున్నా. వాస్తవాలను పణంగా పెట్టి వినోదం పంచకూడదు. విశ్వసనీయత, వాస్తవికత ఉండే కమ్యూనికేషన్‌ను ప్రోత్సహించాలి."
--సారా తెందూల్కర్
Sara Tendulkar and Shubman Gill : టీమ్‌ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో సారా తెందూల్కర్ ఉన్నట్లు ఇటీవల ఓ మార్ఫింగ్ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. సారా తన సోదరుడు అర్జున్ తెందూల్కర్‌తో ఉన్న ఫొటోను కొందరు దుండగులు డీప్‌ఫేక్ చేశారు. అర్జున్ ముఖం స్థానంలో గిల్ ఫొటోను మార్చి వైరల్ చేశారు. గతంలో శుభ్‌మన్ గిల్, సారా తెందూల్కర్ డేటింగ్‌లో ఉన్నారని వదంతులు సృష్టించారు. దీంతో తాజాగా డీప్‌ఫేక్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే సారా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు.
అవసరమైతే ‘డీప్‌ఫేక్’పై కొత్త చట్టం..: కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
మరోవైపు ఇటీవల సినీతారలు రష్మిక, కత్రినాకైఫ్, కాజోల్ డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే డీప్‌ఫేక్‌పై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవడం వల్ల.. కేంద్రం చర్యలు చేపట్టింది. దీనిపై చర్చించేందుకు త్వరలోనే సోషల్ మీడియా సంస్థలతో భేటీ కానుంది. అవసరమైతే డీప్‌ఫేక్‌పై కొత్త చట్టాన్ని కూడా తీసుకొస్తామని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా వెల్లడించారు.
ipl 2023 MI VS GT : గిల్ వర్సెస్ అర్జున్.. సారా సపోర్ట్ ఎవరికో?
గిల్ డబుల్ సెంచరీ.. స్టేడియంలో 'సారా..సారా' స్లోగన్స్.. వీడియోలు చూశారా?