One Ball Highest Runs : క్రికెట్లో ఎన్నో వింతలను మనం చూస్తుంటాం. ఒక్కోసారి బౌలర్లు అనుకోకుండానే తమ ప్రత్యర్థి జట్టుకు భారీ స్థాయిలో పరుగులను సమర్పించుకుంటూ కనిపిస్తుంటారు. అయితే ఒక్క ఓవర్‌లో 18 పరుగులు సమర్పించుకుంటే అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఒక్క బంతికి 18 పరుగులు ఇస్తే మాత్రం అది సెన్సేషనే అవుతుంది. సేలమ్ స్పార్టాన్స్ టీమ్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ చేసిన ఈ పనితో ప్రత్యర్థి జట్టుకు ఒక బంతికే 18 పరుగులు వచ్చేశాయి. దీంతో ఈ ప్రీమియర్ లీగ్‌లో అభిషేక్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెట్టింట అభిషేక్ తన్వర్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
టీఎన్‌పీఎల్ 2023లో భాగంగా మంగళవారం రాత్రి సేలమ్ స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గల్లీస్ జట్ల మధ్య హోరా హోరీ మ్యాచ్ జరిగింది. ఇక చెపాక్ సూపర్ గల్లీస్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో సలేమ్ స్పార్టాన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ బౌలింగ్‌కు దిగాడు. మరోవైపు క్రీజులో సంజయ్ యాదవ్ ఉన్నాడు. తొలుత నాలుగు బంతులకు అభిషేక్ తన్వర్ 6 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఇక ఐదవ బంతి నోబాల్ కాగా.. ఆ తర్వాత బంతికి ఓ పరుగు వచ్చింది. దీంతో ఐదు బంతుల్లో అభిషేక్ తన్వర్ మొత్తంగా ఎనిమిది పరుగులను ప్రత్యర్థి జట్టుకు ఇచ్చుకున్నాడు. అయితే ఓవర్ చివరి బంతి వేయడానికి అభిషేక్ నానా కష్టాలు పడ్డాడు.
ముందుగా నోబాల్ వేయగా.. ఆ తర్వాత వేసిన నోబాల్ ఏకంగా సిక్సర్ వెళ్లింది. తర్వాత బంతి మళ్లీ నోబాల్.. ఈసారి రెండు పరుగులు వచ్చాయి. మళ్లీ వైడ్ బాల్ వేశాడు. ఇక ఓ సరైన బంతి వేయగా.. అది కూడా బౌండరీని దాటింది. ఆఖరి బంతికి అభిషేక్ తన్వర్ మూడు నోబాల్స్, ఒక వైడ్‌తో పాటు రెండు సిక్సర్లు, రెండు పరుగులు ఇచ్చాడు. దాంతో అభిషేక్ తన్వర్ మొత్తంగా ఓ బంతితో ఏకంగా 18 పరుగులు ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకున్నాడు.
-
The most expensive final delivery in history - 18 runs from the last ball of the 20th over. pic.twitter.com/rf8b0wMhOw
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The most expensive final delivery in history - 18 runs from the last ball of the 20th over. pic.twitter.com/rf8b0wMhOw
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 13, 2023The most expensive final delivery in history - 18 runs from the last ball of the 20th over. pic.twitter.com/rf8b0wMhOw
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 13, 2023
Tamil Nadu Premier League 2023 : ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో.. చెపాక్ సూపర్ గల్లీస్ 52 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గల్లీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 217 పరుగులు నమోదు చేసింది. ఇక ప్రదోష్ పాల్ 55 బంతుల్లో 88 రన్స్ స్కోర్ చేయగా.. అపరాజిత్ 19 బంతుల్లో 29 పరుగులు, సంజయ్ యాదవ్ 12 బంతుల్లో 31 పరుగులు, నటరాజన్ జగదీశన్ 27 బంతుల్లో 35 స్కోర్ చేసి రాణించారు. ఆ తర్వాత మైదానంలోకి దిగిన సేలమ్ స్పార్టాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేయగలిగింది. ఇక ఈ జట్టులోని ముహ్మద్ అద్నాన్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ ఇవ్వగా.. జట్టులోని మిగతా సభ్యులు విఫలమయ్యారు.