ETV Bharat / sports

సచిన్ అడ్వైస్​​తోనే అర్జున్ సెంచరీ.. అలా చేయమని చెప్పాడంటా..

తన కొడుకు అర్జున్ తెందుల్కర్​ రంజీ ట్రోఫీలో తొలి సెంచరీ బాదడంపై స్పందించాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​. ఏం అన్నాడంటే..

Sachin tendulkar on Arjun century
సచిన్ అడ్వైస్​​తోనే అర్జున్ సెంచరీ.. అలా చేయమని చెప్పాడంటా..
author img

By

Published : Dec 16, 2022, 9:47 AM IST

Updated : Dec 16, 2022, 11:07 AM IST

దిగ్గజ క్రికెటర్​ సచిన్‌ తెందుల్కర్​ తనయుడు అర్జున్‌ తెందుల్కర్​ ఫస్ట్‌ క్లాస్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రంజీ సీజన్‌లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. రాజస్థాన్​పై జరిగిన మ్యాచ్​లో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 207 బంతులు ఎదుర్కొన్న అతడు 120 పరుగులు చేశాడు. దీంతో అర్జున్​పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే దీనిపై అర్జున్‌ తండ్రి సచిన్‌ కూడా స్పందించాడు. "క్రికెట్‌లో రాణించడం అంత సులభమైన విషయం కాదు. అర్జున్‌కు కూడా ఇది చాలా కష్టమైన ప్రయాణం. అతడు ఆట పరంగా నాకంటే ఎక్కువగా రోహన్ గవాస్కర్‌తో క్లోజ్‌గా ఉంటాడు. ఈ మ్యాచ్‌లో అర్జున్‌ను నైట్ వాచ్‌మెన్‌గా పంపారు. అతడు 4 పరుగులతో నాటౌట్‌గా ఉన్నప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించమని నేను చెప్పాను. ఎన్ని పరుగులు చేస్తే అది మాకు మంచి స్కోర్‌ అవుతుందని అర్జున్‌ నన్ను అడిగాడు. వారు అప్పటికే 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి ఉన్నారు. కనీసం 375 పరుగులు అయినా సాధిస్తే మంచి ఫైటింగ్‌ స్కోర్‌ అవుతుందని నేను చెప్పాను. చివరికి అర్జున్‌ సెంచరీ సాధించడం నాకు చాలా సం‍తోషంగా ఉంది. ఎందుకంటే అర్జున్‌ అందరు పిల్లల్లాగా సాధారణ బాల్యాన్ని గడపలేదు. అతడు ఒక ప్రముఖ క్రికెటర్‌ కొడుకు కావడంతో అతడిపై తీవ్రమైన ఒత్తడి ఉండేది. నేను రిటైర్‌ అయ్యాక ముంబయి మీడియా సమావేశంలో కూడా అదే చెప్పాను. అతడిపై అనవసర ఒత్తిడి పెంచవద్దు, ముందు అర్జున్​ను క్రికెట్‌పై మక్కువను పెంచుకోనివ్వండి అని చెప్పాను. అదే విధంగా అతడొక మంచి క్రికెటర్‌గా ఎదిగితే మీకు నచ్చిన ప్రకటనలను చేయవచ్చు అని కూడా నేను అన్నాను" అని సచిన్‌ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: ఇషాన్‌ కిషన్‌ మరో విధ్వంసం.. రంజీ ట్రోఫీలో సెంచరీ.. దుమ్మురేపుతున్నాడుగా..

Last Updated : Dec 16, 2022, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.