ETV Bharat / sports

IND VS SA: 'రుతురాజ్​ ఓ సంచలనం.. కానీ' - ind vs sa

Ruturaj Gaikwad News: దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్​కు ఎంపికైన ఓపెనర్​ రుతురాజ్​ గైక్వాడ్​ ఓ సంచలమని ప్రశంసించాడు మాజీ క్రికెటర్​, వ్యాఖ్యాత ఆకాశ్​ చోప్రా. అయితే అతడికి తుది జట్టులో అవకాశం రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.

Ruturaj Gaikwad
రుతురాజ్​ గైక్వాడ్
author img

By

Published : Jan 1, 2022, 3:39 PM IST

Ruturaj Gaikwad News: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు ఇటీవలే జట్టును ప్రకటించింది బోర్డు. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై తన అభిప్రాయాన్ని తెలిపాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​, వ్యాఖ్యాత ఆకాశ్​ చోప్రా. శిఖర్​ ధావన్​ జట్టులోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. రుతురాజ్ తుది జట్టులో ఆడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.​​

"ధావన్​ జట్టులో ఉండాలని ఎప్పటి నుంచి అంటున్నా. అతడికి, రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​ మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ఓపెనర్​గా ధావన్​ ఉంటే జట్టుకు ప్రయోజకరం. అతడు రాహుల్​తో కలిసి​ ఓపెనింగ్​ చేయాలి. మూడో స్థానంలో కోహ్లీ ఉంటాడు. అశ్విన్​ రాకతో బౌలింగ్​ విభాగం మరింత బలపడింది. రుతురాజ్​ గైక్వాడ్​ ఒక సంచలనం. ఈ సీజన్​ ఐపీఎల్​, విజయ్​ హజారే ట్రోఫీలో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే అతడికి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే జట్టులో రాహుల్​, ధావన్​, కోహ్లీ, సూర్యకుమార్​, పంత్​ వంటి ఆటగాళ్లంతా ఉన్నారు కాబట్టి రుతురాజ్​కు అవకాశం రాకపోవచ్చు. ఇక వెంకటేశ్​ అయ్యర్​ లోయర్​ ఆర్డర్​లో ఎలాగో ఉంటాడు" అని ఆకాశ్​ పేర్కొన్నాడు.

జనవరి 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. తొలి వన్డే బొలాండ్ పార్క్ వేదికగా జరగనుంది. 21, 23ల్లో రెండు, మూడు వన్డేలు నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: 'కెప్టెన్​గా రాహులే​ సరైనోడు.. రుతురాజ్​ వండర్స్​ చేస్తాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.