ETV Bharat / sports

అనుకున్నట్టే జరిగింది... హిట్​మ్యాన్​తో పాటు అతడు కూడా..

గాయపడిన కెప్టెన్​ రోహిత్ శర్మ ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు బంగ్లాతో జరగబోయే రెండో టెస్టుకు దూరంకానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే హిట్​మ్యాన్​తో పాటు మరో కీలక ప్లేయర్​ కూడా అందుబాటులో ఉండడని తెలిపారు.

Rohith sharma out of second test
బంగ్లాతో రెండో టెస్ట్​.. కెప్టెన్​ రోహిత్​తో పాటు అతడు కూడా..
author img

By

Published : Dec 20, 2022, 2:26 PM IST

Updated : Dec 20, 2022, 3:41 PM IST

అనుకున్నట్టే జరిగింది. బంగ్లాదేశ్​తో జరిగిన రెండో వన్డేలో బొటన వేలికి గాయమైన కెప్టెన్​ రోహిత్ ఇంకా కోలుకోలేదు. అతడు ఇంకా నొప్పితో బాధపడుతున్నాడట. దీంతో బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకూ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇక రోహిత్‌ గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్‌ సారథిగా కొనసాగుతాడు. త్వరలోనే స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్​, ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్​ను దృష్టిలో ఉంచుకుని రోహిత్​కు మరింత విశ్రాంతి ఇచ్చేందుకే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

"రోహిత్ ఫుల్​​ ఇంటెన్సిటీతో ఆడేందుకు మరింత విశ్రాంతి అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్​ చెప్పింది. అతడి ఇంకొన్ని చికిత్స అవసరం. అందుకే రెండో టెస్టుకు కూడా అతడు అందుబాటులో ఉండట్లేదు." అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. కాగా, హిట్​మ్యాన్​తో పాటు పేసర్​ నవదీప్ సైనీ కూడా రెండో మ్యాచ్​కు అందుబాటులో ఉండట్లేదని తెలిపింది బోర్డు. అతడికి కడుపులో ఏదో సమస్య ఉందని చెప్పింది.

ఇదీ చూడండి: దడ పుట్టించిన స్టోక్స్.. 39ఏళ్ల రికార్డు బద్దలు​.. ఇంగ్లాండ్ చేతిలో పాక్​ క్లీన్ ​స్వీప్​

Last Updated : Dec 20, 2022, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.