శ్రీలంకతో స్వదేశంలో సిరీస్ నేపథ్యంలో టీమ్ఇండియా యువ ఆటగాడు రిషభ్ పంత్‌కు జట్టులో చోటుదక్కలేదు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను పక్కనపెట్టిన సెలక్టర్లు ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పంత్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పేలవ ప్రదర్శన.. పొట్టి ఫార్మాట్లో.. కెరీర్ ఆరంభం నుంచి పంత్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుటి వరకు 60కి పైగా మ్యాచుల్లో ఆడినప్పటికీ అతడి యావరేజ్, స్ట్రైక్ రేటు కూడా అంతగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అంతే కాకుండా ఇటీవలి కాలంలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లు మైదానంలో విజృంభిస్తున్నప్పటికీ వాళ్లను పక్కన పెట్టి మరీ పంత్ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు సెలక్టర్స్. కానీ పంత్ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చివరి ఐదు టీ20 మ్యాచుల్లో 27, 3, 6, 6, 11 స్కోర్ మాత్రమే సాధించాడు.
వన్డేల్లో కూడా సోసోగానే.. వన్డేల్లో సైతం అతడి పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌పై సెంచరీ తప్ప ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. మొత్తం పది ఇన్నింగ్స్‌లోనూ 336 పరుగులు మాత్రమే చేశాడు. వీటిలో ఇంగ్లాండ్‌పై సాధించిన సెంచరీ మినహా.. మిగతా 9 ఇన్నింగ్స్ కలిపితే అతడు చేసిన స్కోర్ 200. అందుకే ఈ కారణంగా శ్రీలంక సిరీస్‌కు అతడిని పక్కన పెట్టారు సెలెక్టర్లు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్ కెరీర్ ముగిసిందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వచ్చే ఏడాది జట్టులో అతడికి త్వరగా స్థానం దక్కించుకోవాలంటే.. ఐపీఎల్‌లో ఫామ్‌ను చూపించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: