Ravindra Jadeja World Cup 2023 : టీమ్ఇండియా జట్టులో మేటి ఆటగాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కీలక ఇన్నింగ్స్‌లో బంతులను సంధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతంలో జరిగిన ఆసియా కప్ నుంచి తాజాగా జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ వరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అత్యద్భుత ప్రదర్శన చేసి.. ప్రత్యర్థులను కట్టడి చేశాడు. నిరుడు ఐపీఎల్‌లోనూ తన సత్తా చాటి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా జడేజా గురించే చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటి వరకు ఈ ఆల్‌రౌండర్ అందుకున్న ఘనతలు చేస్తుంటే.. రానున్న వరల్డ్ కప్‌లో అతని పాత్ర కీలకమని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అతని చిన్నానాటి కోచ్ మహేంద్ర సింగ్ చౌహాన్‌తో 'ఈటీవీ భారత్' ముచ్చటించింది. ఎనిమిదేళ్ల పాటు క్రికెట్‌లో శిక్షణ ఇచ్చి.. జడేజాను అంతర్జాతీయ ఆటగాడిగా తీర్చిదిద్దిన ఆయన.. తన శిష్యుడి గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు మీ కోసం..
ఈటీవీ భారత్ - మీరు జడేజాను మొదట సారి ఎప్పుడు కలిశారు ? అతనికి క్రికెట్ పట్ల ఆసక్తి ఎలా కలిగింది ?
మహేంద్ర సింగ్ చౌహాన్-"జడేజాకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు నుంచి నాకు అతను తెలుసు. అయితే అతను నా వద్దకు వచ్చినప్పుడు తొలుత ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాడు. కానీ అతను ఉన్న ఎత్తుకు ఫాస్ట్ బౌలింగకన్నా స్పిన్ బౌలింగ్ బాగుంటుందని దాన్ని ఎంచుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ పై దృష్టి సారించాడు. దాని వల్లే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఓ మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
ఈటీవీ భారత్ - ఓ ప్లేయర్‌గా రవీంద్ర జడేజాకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?
మహేంద్ర సింగ్ చౌహాన్- అతని చురుకుదనమే.. జడేజాను ఇప్పుడున్న స్థాయికి చేర్చింది. ఆ ఒక్క లక్షణమే అతని అందరిలోకల్లా ప్రత్యేకంగా చూపిస్తుంది. మిగతా వారికంటే అతను రెండింతలు కష్టపడ్డాడు. కీలక సమయాల్లో అతనికొచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుని ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిచాడు. వికెట్ల మధ్య రవీంద్ర జడేజా పరుగు చాలా బాగుంది, దిని ద్వారా అతను స్ట్రైక్‌ను నిరంతరం తిప్పుతూ జట్టు స్కోరును నిరంతరం పెంచుతాడు. స్లాగ్ ఓవర్లలో గట్టిగా కొట్టి, ఎవరూ చేయలేని ఆటతో రవీంద్ర చాలా మ్యాచ్‌లలో అసాధ్యమైన మ్యాచ్‌లను గెలుచుకున్నాడు.
ఈటీవీ భారత్- టీవీలో జడేజా ఆటను చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది?
మహేంద్ర సింగ్ చౌహాన్ - వాస్తవానికి నేను టీవీలో మ్యాచ్‌లేవీ చూడను. ఎవరైన నా దగ్గరికి వచ్చి రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీశాడు లేదా 50 పరుగులు చేశాడు అంటూ చెప్తుంటారు. అది విని నేను సంతోషిస్తాను. ఒకవేళ అతను మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో వెనుతిరిగితే.. నేను ఆ రోజంతా బాధపడుతూ ఉంటాను. మ్యాచ్‌లో కూడా నేను జడేజా గురించి మాత్రమే వింటుంటాను. ఓ బౌలర్‌గా జడేజాలో చాలా మెరుగుదల కనిపిస్తోంది. అతని వేగవంతమైన డెలివరీ నాకు ఇష్టం. ఇతర బౌలర్లు ఒక ఓవర్ వేయడానికి నాలుగు నిమిషాలు తీసుకుంటే, జడేజా ఓవర్ మాత్రం రెండున్నర మూడు నిమిషాల్లోనే పూర్తవుతుంది.
ఈటీవీ భారత్- ప్రపంచకప్‌కు ముందు జడేజాకు మీరు ఇచ్చే సలహా ?
మహేంద్ర సింగ్- రవీంద్ర జడేజాకు ఇప్పుడు ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. నేను చెప్పేది మ్యాచ్ గెలవండి ప్రపంచకప్ గెలవండి.
జడ్డూ ఈజ్ బ్యాక్.. అతడు జట్టును ఆదుకున్న మ్యాచ్‌లివే!
జడేజా సూపర్ రికార్డ్.. ఆ ఘనత సాధించిన భారత రెండో ప్లేయర్‌గా..