ETV Bharat / sports

వార్నర్​కు పోటీగా జడేజా.. 'పుష్ప' వీడియోతో 'తగ్గేదే లే' - jadeja pushpa movie

Jadeja pushpa video: 'పుష్ప' సినిమాలోని 'తగ్గేదే లే' డైలాగ్​ను టీమ్​ఇండియా క్రికెటర్​ రవీంద్ర జడేజా అనుకరించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. హీరో అల్లు అర్జున్​ కూడా జడేజా వీడియోపై కామెంట్ చేయడం విశేషం.

jadeja allu arjun pushpa
జడేజా అల్లు అర్జున్ పుష్ప
author img

By

Published : Dec 23, 2021, 8:07 PM IST

Allu arjun pushpa movie: సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా వచ్చిన 'పుష్ప' ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని పాటలు, డైలాగ్, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ అభిమానులను తెగ అలరిస్తున్నాయి. ముఖ్యంగా 'తగ్గేదే లే' అన్న డైలాగ్​ను ఫ్యాన్స్​, సినీప్రియులు తమదైన స్టైల్​లో రీల్స్​ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ డైలాగ్​ను టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా కూడా తనదైన స్టైల్​లో చెప్పి అభిమానులను ఆకట్టుకున్నాడు. మాసిన గడ్డంతో 'పుష్ప' లుక్​లో కనిపిస్తూ .. 'పుష్ప.. పుష్పరాజ్​ నీ యవ్వ తగ్గేదే లే' అంటూ సోషల్​మీడియాలో ఓ వీడియోను పోస్ట్​ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. విపరీతంగా లైక్స్​ కామెంట్స్​ వస్తున్నాయి.

ఈ వీడియోపై అల్లుఅర్జున్​ కూడా స్పందించారు. 'సూపర్'​ అంటూ ఎమోజీని షేర్​ చేశారు. కాగా, 'నీ అంత బాగా చేయలేదులే' అంటూ తిరిగి బదులిచ్చాడు జడేజా. ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్​ క్రికెటర్​ వార్నర్​ కూడా 'పుష్ప' సినిమాలోని 'ఏయ్​ బిడ్డా ఇది నా అడ్డా' పాటను అనుకరిస్తూ షేర్​ చేసిన వీడియోకు అద్భుత స్పందన వచ్చింది.

Ravindra Jadeja allu arjun pushpa video
వీడియోకు అల్లు అర్జున్, జడేజా కామెంట్స్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.