Rahul Dravid World Cup 2023 : 2023 వన్డే ప్రపంచకప్ ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా.. టోర్నమెంట్ మజా ఇంకా మొదలవ్వలేదనే చెప్పాలి. ప్రస్తుతం అందరి నిరీక్షణ భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కోసమే. ఈ రెండు జట్లూ విశ్వకప్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగనుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక ఇరుజట్లు అక్టోబర్ 8న చెన్నై వేదికగా తలపడనున్నాయి. ఈ క్రమంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్.. మీడియాతో మాట్లాడారు. మరి ఆయన ఏమన్నారంటే?
"నిజంగా చెప్పాలంటే, ఒకసారి మ్యాచ్ ప్రారంభమయ్యాక.. జట్టును నడిపించాల్సింది కెప్టెనే. మైదానంలో వ్యూహాలు రచించి, అమలు చేయాల్సింది నాయకుడే. అయితే కోచ్‌లుగా మేము జట్టును.. పోటీకు సన్నద్ధం చేయడం వరకే మా పాత్ర ఉంటుంది. కోచ్‌లుగా మేము ఒక్క పరుగు చేయము, ఒక్క వికెట్ పడగొట్టము. మేము చేసేదల్లా ఆటగాళ్లకు మద్ధతివ్వడమే" అని ద్రవిడ్ అన్నారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ, వ్యూహాలకు మద్ధతిస్తూ.. జట్టు అద్భుతంగా ఆడేందుకు కృషి చేస్తానని ద్రవిడ్ అన్నారు. అలాగే న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర.. గురువారం ఇంగ్లాండ్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను కొనియాడారు. కివీస్‌కు ఈ టోర్నీలో మంచి ఆరంభం లభించిందని అన్నారు.
ఇప్పుడు ఆ సమస్య లేదు.. టీమ్ఇండియా మాజీ పేసర్ పంకజ్ సింగ్.. ఈసారి భారత్ విశ్వకప్ విజేతగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. 2019లో పోలిస్తే.. ఇప్పుడు జట్టులో బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉందన్నాడు. అప్పుడు మిడిలార్డర్లో టీమ్ఇండియా సమస్యలు ఎదుర్కుందని గుర్తుచేసిన పంకజ్.. ఇప్పుడు ఆస్థానాన్ని భర్తీ చేయడానికి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారన్నాడు. అలాగే జట్టులో నాణ్యమైన ప్లేయర్లకు కొదువలేదని తెలిపాడు. బ్యాటింగ్‌లో రోహిత్, విరాట్, రాహుల్, అయ్యర్ ఉండగా.. జట్టుకు అవసరమైనప్పుడు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడేందుకు సూర్యకుమార్ ఉన్నాడని అన్నాడు. ఇక హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా లాంటి ఆల్‌రౌండర్లు, సిరాజ్, షమీ, బుమ్రాతో బౌలింగ్ విభాగం కూడా భీకరంగా ఉందని పంకజ్ పేర్కొన్నాడు.
ఇషాన్‌కు ఛాన్స్! టీమ్ఇండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆసీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌కు జట్టులో చోటు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు చెన్నై చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో చాలాసేపు కసరత్తు చేశాడు.
అయితే టీమ్ మేనేజ్మెంట్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని భావిస్తే.. రోహిత్‌తో ఇషాన్ జతకట్టవచ్చు. ఇషాన్‌కు కూడా గతంలో వన్డే, టీ20ల్లో ఇన్నింగ్స్‌ను ప్రారభించిన అనుభవం ఉండడం.. వికెట్ కీపింగ్ చేయగలగడం కలిసొచ్చే అంశం. అతడు వన్డేల్లో ఒక డబుల్ సెంచరీ సైతం బాదాడు. అయితే గిల్ గైర్హాజరీలో ఇషాన్ ఎంతవరకూ సత్తా చాటుతాడో చూడాలి.
-
The countdown has begun! ⏳
— BCCI (@BCCI) October 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Only 3⃣ days to go now for #TeamIndia's opening fixture of #CWC23 🙌 pic.twitter.com/t6seGym4jb
">The countdown has begun! ⏳
— BCCI (@BCCI) October 5, 2023
Only 3⃣ days to go now for #TeamIndia's opening fixture of #CWC23 🙌 pic.twitter.com/t6seGym4jbThe countdown has begun! ⏳
— BCCI (@BCCI) October 5, 2023
Only 3⃣ days to go now for #TeamIndia's opening fixture of #CWC23 🙌 pic.twitter.com/t6seGym4jb
Ishan Kishan Parents Interview : 'అతడితో ఇషాన్‌ను పోల్చొద్దు.. ఏ ప్లేస్‌లోనైనా ఆడగలడు'