ETV Bharat / sports

భారత్​ను దాటేసిన పాకిస్థాన్​.. ఆ జాబితాలో మనకంటే మెరుగ్గా.. - team india odi ranking

ICC ODI Team Rankings: టీమ్​ఇండియాను అధిగమించింది పాకిస్థాన్ క్రికెట్ జట్టు. ఐసీసీ పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్​లో భారత్​ను వెనక్కునెట్టి నాలుగో స్థానానికి చేరింది.

ICC ODI Team Rankings
Pakistan
author img

By

Published : Jun 13, 2022, 8:19 PM IST

ICC ODI Team Rankings: ఐసీసీ పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియాను అధిగమించింది పాకిస్థాన్. ఇటీవలే ముల్తాన్​లో వెస్టిండీస్​ను క్లీన్​స్వీప్​ చేసిన దాయాదీ జట్టు.. తాజా ర్యాంకింగ్స్​లో నెం.4కు చేరింది. దీంతో భారత జట్టు ఐదో స్థానానికి పడిపోయింది.

వెస్టిండీస్​తో సిరీస్​ ఆరంభానికి ముందు 102 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది పాక్. అయితే 3-0తో సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేయడం ద్వారా 106 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. దీంతో 105 పాయింట్లతో ఉన్న భారత్​.. ఐదుకు పడిపోయింది.

గత కొన్నేళ్లుగా వన్డేల్లో అద్భుతంగా రాణిస్తోంది బాబార్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్. విదేశాల్లో ఇంగ్లాండ్​ మినహా, స్వదేశంలో పర్యాటక జట్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అందులో జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లపై 2-1 తేడాతో సిరీస్​ విజయాలున్నాయి. ఇక 1998 తర్వాత తొలిసారి తమ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియాను కూడా అంతే తేడాతో ఓడించింది పాక్.

ఇదీ చూడండి: టీమ్​ఇండియాకు చావోరేవో.. సిరీస్​పై సఫారీల కన్ను

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.