ETV Bharat / sports

ODI World Cup 2023 Afghanisthan : అఫ్గాన్​ సంచలన విజయాల​ వెనక కన్నీటి గాథలు.. ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర

ODI World Cup 2023 Afghanisthan : అఫ్గానిస్థాన్​ జట్టు ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో ఒకటో రెండో విజయాలు సాధిస్తుందని క్రికెట్​ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ మరీ ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ లాంటి మేటి జట్లను అంత సులువుగా ఓడించేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే ఈ సంచలన విజయాల వెనక ఎంతో కసి, కన్నీళ్ల గాథలు దాగి ఉన్నాయి. అయినా గుండె నిబ్బరం చేసుకుని అఫ్గాన్ వీరులు ముందుకు వెళ్లడం గొప్ప విషయమనే చెప్పాలి.

ODI World Cup 2023 Afghanisthan : అప్గాన్ సంచలన విజయాల​ వెనక కన్నీటి గాథలు.. ఎదుగుదలలో భారత కీలక పాత్ర

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 7:38 AM IST

Updated : Oct 24, 2023, 11:43 AM IST

ODI World Cup 2023 Afghanisthan : ఈ ప్రపంచకప్​లో అఫ్గానిస్థాన్​ సంచలన విజయాలను నమోదు చేయడం ప్రారంభించింది. మొదట డిఫెండింగ్‌ ఛాంపియన్, ఈ ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్​ను(afghanistan england cricket match) మట్టికరిపించి సంచలనం సృష్టించింది. ఇంకా ఆ సెన్సేషన్​ విజయం గురించి క్రికెట్ అభిమానులు మాట్లాడుకోవడం మానలేదు. అంతలోనే.. ఊహించని విధంగా మరో సంచలన విజయంతో చరిత్ర సృష్టించింది అఫ్గాన్​. తాజాగా వరల్డ్ క్లాసింగ్​ బౌలింగ్​, టాప్ బ్యాటర్లు ఉన్న పాకిస్థాన్(afghanistan pakistan world cup match) జట్టును చిత్తుగా ఓడించింది. జట్టులో ఎంతో కసి ఉంటే కానీ ఇలాంటి విజయాలు రావని చెప్పాలి. అయితే ఈ కసి వెనక కన్నీళ్ల గాథలు ఉన్నాయి. అయినా గుండె నిబ్బరం చేసుకుని జట్టు సమిష్టిగా రాణిస్తోందంటే.. హ్యాట్సాఫ్ తప్పక అనాల్సిందే.

అంత తేలిక కాదు.. గత కొన్నేళ్లుగా అఫ్గాన్‌ జట్టు ప్రదర్శన చూస్తున్న వారికి.. ఈ వరల్డ్​కప్​లో వారి ప్రదర్శన చూస్తే... ఇవేవో అనుకోకుండా వచ్చిన విజయాల్లా అస్సలు కనిపించవు. ఎందుకంటే ఆ దేశ ప్లేయర్స్​ ఎలాంటి స్థితిలో వరల్డ్ కప్​లో అడుగు పెట్టారో తెలిస్తే, అసలు వాళ్ల దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే... వారు సాధించిన విజయాలు అంత తేలికైనవి కాదని తెలుస్తుంది. ఆ జట్టుపై అభిమానం మరింత ఎక్కువ పెరుగుతుంది.

కొన్ని రోజుల క్రితం అఫ్గాన్​లో భూకంపం(afghanistan earthquake 2023) కుదిపేయడంతో ఏకంగా 3 వేల మందికి పైగా ప్రాణాలను విడిచారు. అంతకుముందు రెండేళ్ల కిందట తాలిబన్ల చేతుల్లోకి ఆ దేశం వెళ్లిపోవడం వల్ల.. పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు.. అన్ని రకాలుగా ఆ దేశం బాగా చితికిపోయింది. తీవ్ర కష్టాల్లోకి వెళ్లిపోయింది. అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి అఫ్గాన్‌కు ఆర్థిక సాయం ఆగిపోయింది. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఈ మధ్య సంభవించిన భూకంపం మరింత తీవ్రంగా నష్టం కలిగించింది.

బాధను దిగమింగుకుని.. గుండె నిబ్బరంతో... ఇకపోతే అఫ్గాన్‌ దేశం తాలిబన్ల(afghanistan taliban crisis) చేతిలోకి పూర్తిగా వెళ్లిపోయాక.. ఆ దేశ క్రికెటర్లు ఎక్కువగా విదేశాల్లోనే ఉండటం మొదలుపెట్టారు. జాతీయ జట్టు తరపున ఏదైనా సిరీస్ లేదా టోర్నీ ఆడాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఒక చోట చేరుతున్నారు. మిగతా సమయాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర టీ20, టీ20 లీగ్స్‌ ఆడుతూ గడిపేస్తున్నారు. తమ కుటుంబానికి చెందిన వారిని కూడా దుబాయ్‌ సహా ఇతర దేశాలకు తరలించేశారు. కానీ వారికి సంబంధించిన చాలా మంది బంధువులు, సన్నిహితులు అఫ్గానిస్థాన్‌లోనే ఉన్నారు.

అయితే రీసెంట్​గా సంభవించిన భూకంపంలో.. తమకు సంబంధించిన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నిరాశ్రులైపోయారు. అలాంటి పరిస్థితిలో బాధను దిగమింగుకుని.. ఆ జట్టు వరల్డ్ కప్​ 2023లో అడుగు పెట్టింది. ఎంతో కసి, బాధను గుండెల్లోనే ఉంచుకుని.. దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసి మేటి జట్టైన ఇంగ్లాండ్​ను మట్టికరిపించింది.

ఆ మ్యాచ్‌ అయ్యాక అఫ్గాన్‌ ప్లేయర్స్​ ఎంతో ఎమోషనల్​ కూడా అయ్యారు. ఇంగ్లాండ్​పై విజయాన్ని తమ దేశ భూకంప బాధితులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. తమ దేశ ప్రజలు నవ్వడమే మరిచిపోయారని.. కనీసం ఈ విజయం వారి ముఖాల్లో కొంచెమైనా చిరునవ్వును తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యల్ని అఫ్గాన్​​ క్రికెటర్​ రషీద్‌ ఖానే అన్నాడు.

భారత్ అండతో ఇదంతా.. కాగా, గత దశాబ్ద కాలంలో అఫ్గానిస్థాన్‌ ప్రపంచ క్రికెట్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఊహించని దానికన్నా మంచిగా ఎదుగుతూ వస్తోంది. తమకన్నా మేటి జట్లను ఓడిస్తూ ముందుకెళ్తోంది. అయితే మిగతా నేషనల్ టీమ్స్​కు ఉన్నట్టు.. అఫ్గానిస్థాన్‌ ప్లేయర్లకు తమ దేశంలో ఎటువంటి ఉత్తమ క్రికెట్‌ సౌకర్యాలు లేవు(afghanistan cricket facilities). ఇంకా చెప్పాలంటే కొన్నేళ్ల క్రితం వరకు ఆ దేశంలో క్రికెట్‌ స్టేడియమే అనేదే లేదు. అయినా వారు సహజ ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ క్రమక్రమంగా ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నారు. టీ20 లీగ్స్‌ ఆడటం వారికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. రషీద్‌ ఖాన్, నబి, గుర్బాజ్, ముజీబ్‌ రెహ్మాన్, నవీనుల్‌ హక్‌, ఫారూఖీ లాంటి ప్లేయర్స్​.. తమ దేశాన్ని ప్రపంచ క్రికెట్లో చెప్పుకోదగ్గ స్థాయికి తీసుకెళ్లారు.

అలా అఫ్గాన్​​ క్రమక్రమంగా ఎదుగుతున్న సమయంలో ఆ దేశానికి భారత్‌ అండగా నిలవడం ప్రారంభించింది. ఆ దేశంలో స్టేడియాన్ని నిర్మించింది. క్రికెట్‌ సౌకర్యాలను సమకూర్చింది. అఫ్గాన్​ తమ సొంతగడ్డపై సిరీస్‌లు ఆడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. భారత్​ వేదికగా ఆడేలా అవకాశమిచ్చింది. ఇక్కడి క్రికెట్‌ సౌకర్యాలను ఉపయోగించుకునేలా అక్కడి ఆటగాళ్లకు సౌలభ్యాన్ని కల్పించింది. లాల్‌సింగ్‌ రాజ్‌పుత్, మనోజ్‌ ప్రభాకర్‌(afghanistan cricket indian coach) లాంటి వారు గతంలో అఫ్గాన్‌కు కోచ్‌లుగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్​ కప్​లోనూ అజయ్‌ జడేజా అఫ్గానిస్థాన్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. అలా అఫ్గాన్‌ ఎదుగుదలలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది.

ODI World Cup 2023 PAK VS AFG : చరిత్ర సృష్టించిన అప్గానిస్థాన్.. పాకిస్థాన్​పై​​ సంచలన విజయం

Virat Kohli Centuries : జస్ట్​ మిస్​.. కోహ్లీ సెంచరీలు చేజార్చుకున్న సందర్భాలు ఎన్నో తెలుసా?

Last Updated : Oct 24, 2023, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.