టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత నమోదైంది. ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ కేవలం ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. 258 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 256 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ గెలుస్తుందన్న ఈ మ్యాచ్ అనూహ్యంగా మలుపు తిరిగి కివీస్‌కు సంచలన విజయాన్ని కట్టబెట్టింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1 సమం చేసుకుంది న్యూజిలాండ్.
ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్(95) అద్భుత ప్రదర్శన చేశాడు. అతడు ఉన్నంత వరకు ఇంగ్లాడ్ సునాయసంగా గెలుస్తుందని అనుకున్నారంతా. కానీ విజయానికి 56 పరుగుల దూరంలో టెయిల్ ఎండర్లకు ఛేజింగ్ అప్పడిగించాడు రూట్. కానీ, కివీస్ బౌలర్లు రెచ్చిపోవడం వల్ల మ్యాచ్ మలుపు తిరిగింది. విజయానికి ఒక పరుగు దూరంలో.. వాగ్నర్ బౌలింగ్‌లో జేమ్స్ ఆండర్సన్ ఆడిన బంతిని టామ్ బ్లండెల్ క్యాచ్ పట్టాడు. దీంతో ఇంగ్లాండ్ కథ ముగిసింది. కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నర్(4) వికెట్లతో రెచ్చిపోగా.. టిమ్ సౌథీ(3), హెన్రీ(2) వికెట్లు తీసి రాణించారు.
అరుదైన ఘనత..
146 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడం ఇది నాలుగోసారి. ఇదే కాకుండా ఫాలో ఆన్ ఆడిన తర్వాత విజయం సాధించిన మూడో దేశంగా న్యూజిలాండ్ అవతరరించింది. ఇప్పటివరకు ఫాలో ఆన్ ఆడి గెలిచింది భారత్, ఇంగ్లండ్ మాత్రమే.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చేసింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో కివీస్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. విలియమ్సన్తో పాటు వికెట్ కీపర్ బ్లండెల్(90) రాణించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 483 పరుగులకు ఆలౌటైంది. ఇక ఈ ఇన్నింగ్స్‌లో విలియమ్సన్(132) పరుగులతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత 258 పరుగుల తేడాతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 256 పరుగులకే ఆల్ఔట్ అయింది.