ETV Bharat / sports

ఐపీఎల్​-15 బ్లూప్రింట్ రెడీ.. మెగా వేలం అప్పుడే! - డిసెంబర్​లో ఐపీఎల్ మెగా వేలం

ఐపీఎల్​ 15వ సీజన్(IPL 15th Edition)​ మెగా వేలానికి సంబంధించి బ్లూప్రింట్​ను ఖరారు చేసింది బీసీసీఐ. లీగ్​లోకి కొత్త ఫ్రాంఛైజీలతో పాటు జట్ల సాలరీ పర్స్​లో పెరుగుదల, మీడియా హక్కులకు సంబంధించి మార్పులు జరగనున్నాయి. వచ్చే సీజన్​కు సంబంధించి మెగా వేలాన్ని డిసెంబర్​లో నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ipl blue print, bcci
ఐపీఎల్, బీసీసీఐ
author img

By

Published : Jul 5, 2021, 11:54 AM IST

Updated : Jul 5, 2021, 12:20 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 15వ సీజన్​కు(IPL 15th Edition) సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) బ్లూప్రింట్​ ఖరారు చేసింది. ఇందులో ఐపీఎల్​లో చేరనున్న కొత్త ఫ్రాంఛైజీలతో పాటు ప్లేయర్ల మెగా వేలం, ఫ్రాంఛైజీల సాలరీ పర్స్​లో పెరుగుదల, మీడియా హక్కుల వంటి విషయాలలో పలు మార్పులు రానున్నాయి. సంబంధిత ప్రణాళికలు 2021 ఆగస్టు నుంచి 2022 జనవరి మధ్యలో విడుదల కానున్నాయి.

మరో రెండు జట్లు..

వచ్చే ఐపీఎల్​ సీజన్​ నుంచి రెండు కొత్త ఫ్రాంఛైజీలను లీగ్​లోకి తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన టెండర్​ డాక్యుమెంట్​ ఆగస్టులో విడుదల చేస్తారు. చెక్​లు, బిడ్లు, కొత్త జట్లు ఏవనే విషయాలు అక్టోబర్​ మధ్యలో పరిచయమవుతాయి. ఈ ఏడాది డిసెంబర్​లో మెగా వేలం జరుగుతుంది.

కోల్​కతాకు చెందిన ఆర్పీ-సంజీవ్​ గోయెంకా గ్రూప్​, అహ్మదాబాద్​కు చెందిన అదానీ గ్రూప్​, హైదరాబాద్​కు చెందిన అరబిందో ఫార్మా లిమిటెడ్, గుజరాత్​కు చెందిన టోరెంట్​ గ్రూప్​.. కొత్త జట్ల రేసులో ఆసక్తి చూపుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని కార్పొరేట్​ సంస్థలు, ప్రైవేట్ ఈక్విటీ, సలహా సంస్థలు కూడా కొత్త ఫ్రాంఛైజీల రేసులో ఉన్నాయి.

సాలరీ పర్స్​లో పెరుగుదల..

ఇక ప్రతి ఫ్రాంఛైజీ సాలరీ పర్స్​ను రూ.5 కోట్లు పెంచింది బీసీసీఐ. ఇప్పటివరకు రూ.85 కోట్లుగా ఉన్న మొత్తాన్ని.. రూ.90 కోట్లకు పెంచింది. దీంతో మొత్తంగా 10 ఫ్రాంఛైజీలకు రూ.50 కోట్లు సాలరీ పర్స్​ పెంచినట్లైంది. ఇందులో నుంచి ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల కొనుగోలుకు 75 శాతం తప్పనిసరిగా ఖర్చు పెట్టాలి. వచ్చే మూడేళ్లలో అంటే 2024 సీజన్​ వరకు ఈ మొత్తం రూ.100 కోట్లకు చేరనుంది.

ఇదీ చదవండి: హెచ్‌సీఏలో మరో మలుపు.. ఏం జరిగిందంటే?

ఈ సారి మెగా వేలం..

ఈ సారి ఐపీఎల్​కు ముందు మెగా వేలం నిర్వహించనుంది బీసీసీఐ. ప్రతి జట్టు తమతో పాటు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఇచ్చారు. అంటే ఇద్దరు స్వదేశీ, ఇద్దరు విదేశీ లేదా ముగ్గురు స్వదేశీ, ఒక విదేశీ ఆటగాళ్లను.. అట్టిపెట్టుకోవచ్చు. మిగిలిన ప్లేయర్లను వేలం కోసం విడుదల చేయాలి. ఆటగాళ్లకు ఎంత మొత్తం ఇస్తున్నారనే విషయాన్ని ఫ్రాంఛైజీలు ముందుగానే ప్రకటించాలి. సంబంధిత మొత్తాన్ని సాలరీ పర్స్​లో నుంచి తీసివేయాలి.

ముగ్గురు ఆటగాళ్లను తమతో పాటే అట్టిపెట్టుకుంటే రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లు.. వారికి కేటాయించాలి. ఇద్దరు ఆటగాళ్ల కోసం రూ.12.5 కోట్లు, రూ.8.5 కోట్లు.. ఒకే ఆటగాడి కోసం రూ.12.5 కోట్లు వారికి ముందుగానే చెల్లించాలి.

అంటే ఉదాహరణకు చెన్నై సూపర్​ కింగ్స్​.. స్వదేశీ ఆటగాళ్ల జాబితాలో ధోనీతో పాటు రైనాను, విదేశీ ప్లేయర్లుగా డుప్లెసిస్​, బ్రేవోను అట్టిపెట్టుకుందనుకుందాం. అలా కాదని ముగ్గురు స్వదేశీ క్రికెటర్ల కోసం ఆసక్తి చూపిస్తే విదేశీ ప్లేయర్లలో ఒకరిని వదులుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ విధానంలో పలు మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.

మీడియా హక్కులు..

మీడియా హక్కులకు సంబంధించి వేలం నిర్వహించేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేస్తోంది బీసీసీఐ. ఇందుకు సంబంధించి టెండర్​ డాక్యుమెంట్​ను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తారు. వీరికి కనీసం 25 శాతం పెరుగుదల ఉండనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఓటీటీ వేదికలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.

ఇదీ చదవండి: 'టీమ్​ ఇండియా నెక్స్ట్​ కోచ్​గా అతడే బెస్ట్​'!

Last Updated : Jul 5, 2021, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.