ETV Bharat / sports

'పంత్​కు కొన్ని రోజులు విశ్రాంతి ఇస్తే మంచిది' - మదన్​లాల్ వ్యాఖ్యలు

Madanlal on Rishabh Pant: టీమ్ఇండియా వికెట్​ కీపర్​ రిషభ్​ పంత్ బ్యాటింగ్​పై​ అసంతృప్తి వ్యక్తం చేశాడు మాజీ ఆటగాడు మదన్​లాల్. కొన్ని రోజులు పంత్​కు విశ్రాంతి ఇవ్వడం మంచిదని సూచించాడు.

rishabh pant
రిషభ్ పంత్
author img

By

Published : Jan 8, 2022, 3:45 PM IST

Madanlal on Rishabh Pant: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టీమ్​ఇండియా వికెట్​కీపర్ రిషభ్​ పంత్ పేలవ ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. జోహన్నెస్​బర్గ్​ వేదికగా జరిగిన రెండో ఇన్నింగ్స్​లో పంత్​ భారీ షాట్​ ఆడేందుకు ప్రయత్నించి కీపర్​కు​ చిక్కాడు. ఆ షాట్ ఎంపిక తప్పని మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై టీమ్​ఇండియా మాజీ ఆటగాడు మదన్​లాల్ స్పందించాడు.

"పంత్​కు కొన్ని రోజులు విరామం ఇవ్వాలి. టీమ్​లో మెరుగైన ఆటగాడు వృద్ధిమాన్​ సాహా ఉన్నాడు. అతడు మంచి వికెట్ కీపర్ కూడా. టెస్టు క్రికెట్​లో ఎలా బ్యాటింగ్ చేయాలో పంత్​కు ఇంకా అర్థం కాలేదేమో?. ఒకవేళ ఈ సందేహం అతడికి ఉంటే.. కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వడం మంచింది. అతడు మ్యాచ్​ విన్నింగ్ ప్లేయరే.. కానీ, ఇలా బ్యాటింగ్​ చేస్తే కాదు. అతడు జట్టు కోసం ఆడాలి, స్వప్రయోజనాల కోసం కాదు."

- మదన్​లాల్, మాజీ క్రికెటర్.

కాగా, రెండో టెస్టులో టీమ్​ఇండియాపై విజయం సాధించి మూడు మ్యాచ్​ల సిరీస్​ను 1-1గా సమం చేసింది దక్షిణాఫ్రికా. చివరి టెస్టు కేప్​టౌన్​ వేదికగా జనవరి 11న ప్రారంభంకానుంది.

ఇదీ చదవండి:

కోహ్లీపై వ్యంగ్యాస్త్రాలు.. ఓ వెబ్​సైట్​కు జాఫర్ కౌంటర్

కోహ్లీ వైఫల్యాలు సహజమే.. ఒత్తిడితోనే అలా: వార్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.