ETV Bharat / sports

అండర్సన్@650.. తొలి పేసర్​గా ఘనత.. గావస్కర్​ను అధిగమించిన రూట్ - జేమ్స్ అండర్సన్​ 650వ వికెట్​ రికార్డు

James Anderson 650th wicket: ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్​ ఓ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్​లో 650వ వికెట్​ను సాధించాడు. దీంతో ఈ ఫీట్​ను అందుకున్న తొలి ఫాస్ట్​ బౌలర్​ సహా.. ఈ ఫార్మాట్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో ప్లేయర్​గా రికార్డుకెక్కాడు.

joe root, james anderson
జో రూట్​, జేమ్స్ అండర్సన్​
author img

By

Published : Jun 14, 2022, 8:57 AM IST

Updated : Jun 14, 2022, 12:10 PM IST

James Anderson 650th wicket: ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్​ టెస్టు క్రికెట్​లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో టామ్​ లాథమ్​ను పెవిలియన్​ చేర్చిన అతడు.. కెరీర్​లో 650వ వికెట్​ను దక్కించుకున్నాడు. దీంతో ఈ ఫీట్ సాధించిన తొలి ఫాస్ట్​ బౌలర్​గా నిలవగా.. అలానే ఇంగ్లీష్ జట్టు తరఫున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్​గానూ నిలిచాడు. మరోవైపు టెస్టుల్లో ఈ మార్క్​ను అందుకున్న మూడో బౌలర్​గానూ రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ముత్తయ్య మురళీధరన్​(800), షేన్​ వార్న్​(708) రెండో స్థానంలో ఉన్నాడు.

కాగా, ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 539 పరుగులకు ఆలౌట్​ అయింది. జో రూట్​(176), ఓలీ పోప్​(145) పరుగులతో రాణించారు. అంతకుముందు న్యూజిలాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 553 రన్స్​కు ఆలౌట్ అవ్వగా.. జట్టులో మిచెల్​(190), టామ్​ బ్లండల్​(106) మంచి ప్రదర్శన చేశారు. దీంతో 14 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన కివీస్​ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఫలితంగా 238 పరుగుల ముందంజలో ఉంది.

Joe root 10000 runs record: ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​ కూడా ఓ ఘనత సాధించాడు. దిగ్గజ క్రికెటర్​ సునీల్ గావస్కర్​ రికార్డును అధిగమించాడు. టెస్టు క్రికెట్​లో 10,191పరుగులు సాధించి గావస్కర్​(10,122), పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ యూనిస్ ఖాన్​ను దాటి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 12వ స్థానానికి చేరుకున్నాడు. ఈ ఫీట్​ను న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో అందుకున్నాడు. ఇక ఈ ఫార్మాట్​లో భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​ 15,921రన్స్​తో అగ్రస్థానంలో నిలిచాడు.

ఇదీ చూడండి: హెడ్‌కోచ్‌ రమేశ్‌ పొవార్​తో గొడవ.. స్పందించిన మిథాలీ రాజ్​

Last Updated : Jun 14, 2022, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.