ETV Bharat / sports

Shivam Dube: ఈ ఆరడుగుల బుల్లెట్‌.. నయా 'యువీ'

author img

By

Published : Apr 13, 2022, 12:44 PM IST

Shivam Dube IPL 2022: ఆర్​సీబీతో జరిగిన మ్యాచ్​లో కళ్లు చెదిరే సిక్సర్లతో ఆకట్టుకున్నాడు చెన్నై ఆటగాడు శివమ్​ దూబే. అదిరిపోయే షాట్లు బాది టీమిండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ను తలపించాడు. ఈ నేపథ్యంలో ఈ ఆరడుగుల బుల్లెట్​ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.

Shivam Dube
శివమ్​ దూబే

Shivam Dube IPL 2022: అతడు 'ఆరడుగుల బుల్లెట్'.. సినీ హీరోలకు ఏమాత్రం తగ్గని గ్లామర్‌.. దారితప్పి క్రికెట్‌ వైపు అడుగులు వేశాడేమోననిపిస్తుంది. అయితే.. ఈ 28 ఏళ్ల లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ క్రీజ్‌లోకి వచ్చాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌ను చూసినట్లు అనిపిస్తుంటుందని సహచరులు 'ఆట'పట్టిస్తుంటారు. నిజంగానే యువీని తలపించేలా భారీ షాట్లను అలవోకగా కొట్టేయగలడు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందనకుంటా.. అతగాడే చెన్నై బ్యాటర్‌ శివమ్‌ దూబే..

Shivam Dube
శివమ్‌ దూబే

3, 49, 57, 3, 95.. ఇవీ టీ20 లీగ్ ఈ సీజన్‌లో యువ బ్యాటర్‌ బ్యాట్‌ నుంచి వచ్చిన పరుగులు.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సహచరులకు భరోసా ఇచ్చేలా ఆడేస్తాడు. ఈ సీజన్‌లో వరుస అపజయాలతో చెన్నై తీవ్ర విమర్శలు పాలైన సమయంలో.. తన అద్భుత ఆటతీరుతో దూబే జట్టును బోణీ కొట్టించాడు. 95* పరుగులతో కీలక పాత్ర పోషించాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో త్రుటిలో శతకం చేజార్చుకున్నప్పటికీ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చెన్నై 36/2 స్కోరుతో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన శివమ్‌.. ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప (88)తో కలిసి మూడో వికెట్‌కు కేవలం 73 బంతుల్లోనే 165 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 11 ఏళ్ల కిందట బెంగళూరు, చెన్నై జట్ల మధ్య నమోదైన రికార్డును శివమ్‌ సమం చేశాడు. అప్పటి చెన్నై బ్యాటర్‌ మురళీ విజయ్‌ (95) కూడా ఇదే స్కోరు సాధించాడు.

అంతకుముందు లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లోనూ దూబే సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి విలువైన (49) పరుగులు చేశాడు. అదేవిధంగా పంజాబ్‌తో 181 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై 126 పరుగులకే కుప్పకూలింది. అయితే శివమ్‌ దూబే (57) అర్ధ శతకం సాధించడం విశేషం. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దూబేకు ముందు జోస్ బట్లర్ (218) కేవలం 11 పరుగులు మాత్రమే అధికంగా ఉన్నాడు. బ్యాటింగ్‌లో రాణిస్తున్నప్పటికీ.. బౌలింగ్‌లోనూ ప్రదర్శన బాగుంటేనే టీమ్‌ఇండియాకు 'యువీ' లాంటి ఆల్‌రౌండర్ లేని లోటును భర్తీ చేసే అవకాశం శివమ్‌ దూబే తలుపు తడుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Shivam Dube
శివమ్‌ దూబే

ఎవరీ శివమ్‌ దూబే..?: ముంబయిలో 1993లో జన్మించిన శివమ్‌ దూబే లెఫ్ట్ హ్యాండ్‌ బ్యాటర్‌, కుడి చేతి బౌలర్‌ కావడం గమనార్హం. కేవలం పంతొమ్మిదేళ్లకే ముంబయి అండర్- 23 (సీనియర్) జట్టులో స్థానం సంపాదించాడు. ఐదేళ్ల కిందట రంజీ ట్రోఫీలోకి డెబ్యూ చేసిన శివమ్‌ దూబే ఇప్పటి వరకు 16 మ్యాచుల్లో 48.19 సగటుతో 1,012 పరుగులు చేశాడు. బౌలర్‌గానూ 40 వికెట్లు పడగొట్టాడు. రెండేళ్ల వ్యవధిలోనే 2019లో టీమ్‌ఇండియా తరఫున, ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన దూబేకు పెద్దగా అవకాశాలు దక్కలేదు.

దూబే గురించి మరికొన్ని విశేషాలు..

  • టీ20 లీగ్‌లో బెంగళూరు, రాజస్థాన్‌తో జట్లలో ఆడిన దూబే.. ప్రస్తుతం చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
  • భారీ షాట్లను కొట్టగలిగే దూబేను మెగా వేలంలో చెన్నై రూ. 4 కోట్లకు దక్కించుకుంది.
  • శివమ్‌ దూబేకు 2021లో అంజుమ్‌ ఖాన్‌తో వివాహమైంది. వీరికి ఈ ఏడాది ఫిబ్రవరి 13న బాబు పుట్టాడు.
  • సోషల్‌ మీడియాలో తక్కువ యాక్టివ్‌గా ఉండే శివమ్‌కు ఇన్‌స్టాలో 5.48 లక్షలు, ట్విటర్‌లో 1.95 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
  • ట్విటర్‌లో12 మందినే ఫాలో అయ్యే శివమ్‌.. క్రికెట్‌కు సంబంధించి కాకుండా నరేంద్ర మోదీని మాత్రమే అనుసరిస్తున్నాడు.
  • గతేడాది (2021) టీ20 లీగ్‌లో తొమ్మిది మ్యాచుల్లో 230 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 64 నాటౌట్.
  • ఇక 2020 సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 129 పరుగులు మాత్రమే చేశాడు. అయితే బౌలింగ్‌లో 2/15 ఉత్తమ బౌలింగ్‌తో నాలుగు వికెట్లు తీశాడు.
  • అరంగేట్రం చేసిన 2019 సీజన్‌లోనైతే పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం నాలుగు మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు. అందులోనూ 40 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 24 కావడం విశేషం.

ఇదీ చూడండి: భారత్​కు ఆడాలనుకుని.. ప్రత్యర్థిగా బరిలోకి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.