Delhi capitals physio: ఐపీఎల్లో కరోనా కలకలం రేగింది. దిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ఫిజియో ప్యాట్రిక్ ఫర్‌హార్ట్‌కు పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడిని క్వారంటైన్‌కు పంపినట్లు దిల్లీ యాజమాన్యం తెలిపింది. వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. ప్యాట్రిక్‌ను కలిసిన, సన్నిహితంగా మెలిగిన ప్లేయర్లకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఎవరికి కూడా పాజిటివ్ రాకపోవడంతో దిల్లీ మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది.
ఐపీఎల్ 2021 సీజన్‌లో సగం మ్యాచులు ఆడిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో అర్ధాంతరంగా టోర్నీని నిలిపివేశారు. యూఏఈ వేదికగా మిగతా మ్యాచ్‌లను నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఈ సీజన్‌లో బయో బబుల్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది బీసీసీఐ. బయో బబుల్‌లోకి బయటి వ్యక్తులను అనుమతించేది లేదని తెగేసి చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే... 7 రోజుల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాతే తిరిగి జట్టుతో కలవాలని బీసీసీఐ తేల్చి చెప్పింది.
ఒకవేళ ఏ జట్టు అయినా క్వారంటైన్ పూర్తి కాకుండానే బయటి వ్యక్తులను బయో బబుల్‌లోకి అనుమతిస్తే.. రూ.1 కోటి జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని ఫ్రాంఛైజీలకు హెచ్చరించింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. నిబంధనలు ఇంత కఠిన తరం ఉన్నా.. కరోనా కేసు వెలుగు చూడడంపై బీసీసీఐ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: IPL 2022: అంచనాల్లేని 'ఆ నలుగురు' అదరగొడుతున్నారు..