ETV Bharat / sports

IPL 2023: ఒకే ఫ్రేమ్​లో ఇద్దరు దిగ్గజాలు.. స్టన్నింగ్​ క్యాచ్​తో మెరిసిన ఛెత్రి

author img

By

Published : Apr 1, 2023, 3:58 PM IST

భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లతో కలిసి సరదాగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలోనే అదిరిపోయే స్టన్నింగ్ క్యాచ్​ను పట్టుకుని అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియో చూశారా?

sunil chhetri with RCB
IPL 2023: ఒకే ఫ్రేమ్​లో ఇద్దరు దిగ్గజాలు.. స్టన్నింగ్​ క్యాచ్​లో మెరిసిన ఛెత్రి

భారత ఫుట్‌బాల్‌ ప్రేమికులకు.. మన జట్టు​ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అతడు తాజాగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లతో కలిసి సందడి చేశాడు. ఆర్సీబీ క్రికెటర్ల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అతడు.. వారితో భాగస్వామ్యయమ్యాడు. ఆటగాళ్లందరితో కలిసి సరదాగా మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలోనే డైవ్‌ చేసి అద్భుతమైన క్యాచ్​తో క్రికెట్​ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలోనే అతడు.. తన స్నేహితుడు, ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్​ విరాట్‌ కోహ్లీతో పాటు సరదాగా కాసేపు ముచ్చటించాడు.

ఒకే ఫ్రేములో ఇద్దరు దిగ్గజాలు.. ఆర్సీబీ ప్లేయర్స్​తో కలిసి ప్రాక్టీసు చేస్తూ సందడి చేసిన సునీల్‌ ఛెత్రి... కోహ్లీతో కలిసి సరదాగా కాసేపు మాట్లాడాడు. ఆటలో భాగంగా ఓ స్టన్నింగ్స్‌ క్యాచ్‌ కూడా అందుకుని వావ్ అనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు సోషల్​మీడియాలో అభిమానులతో షేర్​ చేసుకుంది. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోలను, వీడియోలను చూసిన ఫ్యాన్స్​.. కోహ్లీ, ఛెత్రిని ఒకే ఫ్రేములో చూసి.. తెగ సంబంరపడిపోతున్నారు. "ఇద్దరు దిగ్గజాలు ఒకేచోట.. చూస్తుంటే ఎంత బాగుందో" అని తెగ మురిసిపోతున్నారు.

1430 రోజుల తర్వాత.. కరోనా నిబంధనల నేపథ్యంలో 1430 రోజుల తర్వాత తొలిసారి తమ సొంత మైదానంలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తమ మొదటి మ్యాచ్‌ ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబయితో ఈ సీజన్​ను ఆరంభించనుంది. ఏప్రిల్ 2న ఈ మ్యాచ్​ జరగనుంది. దీంతో ఇప్పటికే ఆర్సీబీ ప్లేయర్స్ అంతా తమ క్యాంపుల్లో ప్రాక్టీస్​ను కూడా ప్రారంభించేశారు. నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, స్టార్‌ ఫుట్​బాలర్​ ఛెత్రి.. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇటీవలే 85వ గోల్‌ నమోదు చేసి రికార్డుకెక్కాడు. దీంతో ప్రపంచ దిగ్గజ ఫుట్​బాలర్​ అయిన క్రిస్టియానో రొనాల్డో, అలీ దాయి, లియోనల్‌ మెస్సీ, మొక్తార్‌ దాహరి సరసన చేరాడు. ఇకపోతే ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో సునిల్‌ ఛెత్రి.. బెంగళూరు ఎఫ్‌సీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇకపోతే దాదాపు పదిహేనేళ్లుగా భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ముఖచిత్రంగా కొనసాగుతున్న సునీల్‌ ఛెత్రిని గతేడాది సెప్టెంబరులో ఫిఫా గౌరవించింది. 38 ఏళ్ల ఈ భారత కెప్టెన్‌ రికార్డులను, ఘనతలను గుర్తించి.. అతడి కెరీర్‌పై స్పెషల్​గా మూడు ఎపిసోడ్ల వెబ్‌ సిరీస్‌ను రిలీజ్ చేసింది. ఈ ఎపిసోడ్​లు.. ఫిఫా స్ట్రీమింగ్‌ వేదిక అయిన ఫిఫా+లో అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చూడండి: IPL 2023: టాస్​ గెలిచిన కోల్​కతా.. బ్యాటింగ్ ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.