ETV Bharat / sports

ధోని స్టైల్‌లో ఫినిషింగ్ ఇచ్చిన తెలుగు కుర్రోడు​.. ఆఖరికి రివెంజ్​ తీర్చుకున్నాడుగా!

సీజన్ ఫస్టాఫ్‌లో ఎదురైన ఓటమికి.. తాజా విజయంతో ముంబయి ఇండియన్స్​ రివెంజ్​ తీర్చుకుంది. ఇందుకు కారణమైన వ్యక్తుల్లో మన తెలుగు తేజం తిలక్ వర్మ కూడా ఉన్నాడు. అయితే అతను ఈ మ్యాచ్​ ద్వారా తన లెక్కను సరిచేసుకున్నాడు. ఇంతకీ అదేంటంటే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 4, 2023, 3:01 PM IST

11 రోజులు.. 264 గంటల ఎదురు చూపుకు తెరదింపుతూ ఆ ప్లేయర్​ ఎట్టకేలకు రివెంజ్​ తీసుకున్నాడు. ధోని స్టైల్​లో ఫినిషింగ్​ ఇచ్చి మ్యాచ్​ను గెలుపొందేలా చేశాడు. అతనే ముంబయి ఇండియన్స్​కు చెందిన బ్యాటర్ తిలక్ వర్మ. ఈ 20 ఏళ్ల తెలుగు కుర్రోడు.. ప్రత్యర్ధి గడ్డపై తన దైన స్టైల్​లో విజృంభించి జట్టు గెలుపుకు సహకరించాడు. ఈ ఐపీఎల్​ సీజన్​ మొదలైనప్పటి నుంచి ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రెండుసార్లు మ్యాచ్​ జరిగింది. ఏప్రిల్ 22న వాంఖడే స్టేడియం వేదికగా ఓ సారి పోరు జరగింది. అందులో చివరి ఓవర్‌కు ముంబయి విజయం సాధించాలంటే వారికి 16 పరుగులు స్కోర్​ చేయాల్సిన అవసరం ఉంది.

కానీ అదే సమయానికి అర్షదీప్ బౌలింగ్ చేస్తుండగా.. క్రీజులో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తిలక్ వర్మ ఉన్నాడు. అయితే తిలక్ కేవలం 4 బంతులను మాత్రమే ఎదుర్కొని 3 పరుగులు స్కోర్​ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో అతను నెటిజన్లకు టార్గెట్​ అయ్యి ట్రోటింగ్స్​ను ఎదుర్కొన్నాడు. అయితే బుధవారం మొహాలీ వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మరోసారి మ్యాచ్ జరిగింది. అయితే ఈసారి మాత్రం తిలక్ వర్మ.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఓ సూపర్​ సిక్స్ కొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అలా పంజాబ్ నిర్దేశించిన ఆ 215 పరుగుల లక్ష్యాన్ని ముంబయి 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సాధించింది. ఈ క్రమంలో 75 పరుగులను స్కోర్​ చేసిన ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తిలక్ వర్మ చివరి 10 బంతుల్లో అజేయంగా 26 పరుగులను చేసి మ్యాచ్ విన్నర్ అయ్యాడు.

  • IPL 2023:

    Arshdeep Singh broke Tilak Varma's middle stump in the first match.

    Tilak Varma smacked 6,4,6 against Arshdeep in the 2nd match. pic.twitter.com/sFkDUYsYTH

    — Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఒక ఓవర్​లో 3 బౌండరీలు..
గతంలో అర్షదీప్​ బౌలింగ్​కు బలైన తిలక్​.. ఈ సారి మాత్రం మైదానంలో చెలరేగిపోయాడు. చివరి ఓవర్‌లో సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. కాగా అంతకుముందు, 17వ ఓవర్లో అర్షదీప్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లతో పాటు ఓ ఫోర్ కొట్టి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబయి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్.. కామెరూన్ గ్రీన్(23)‌తో కలిసి క్రీజులో చెలరేగాడు. 54 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీ.. నాథన్ ఎల్లిస్ బౌలింగ్​లో దొరికిపోయారు. దాంతో ముంబయి పవర్​ప్లేలో 2 వికెట్లకు 54 పరుగులను మాత్రమే స్కోర్ చేయగలిగింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యతో కలిసి ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరోవైపు సూర్య తనదైన షాట్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మూడో వికెట్‌కు 124 పరుగులు జోడించాక సూర్యను ఎల్లిస్ ఔట్ చేశాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్‌ను అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఆఖరిగా దిగిన టీమ్ డేవిడ్, తిలక్ వర్మ.. టీమ్​కు విజయాన్ని అందిచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.