ఐపీఎల్ రెండో దశలో ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. నేడు(సెప్టెంబరు 27) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. జేసన్ రాయ్(60), కేన్ విలియమ్సన్(51*) బాగా రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహిపాల్, చేతన్ సకారియా తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆర్‌ఆర్ మంచి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (6) విఫలం కాగా.. అనంతరం వచ్చిన సంజూ శాంసన్ మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (38)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అయితే జైశ్వాల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లివింగ్‌స్టోన్ (4) ఎక్కువసేపు నిలబడలేదు. 10 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసిన రాజస్థాన్‌ను మహిపాల్ లామరర్ (29)తో కలిసి శాంసన్ ఆదుకున్నాడు. వీరిద్దరూ కలిసి 84 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో సంజూతోపాటు పరాగ్ పెవిలియన్‌కు చేరడంతో రాజస్థాన్ 164 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 2.. సందీప్ శర్మ, భువనేశ్వర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: IPL 2021: సంజు సూపర్ బ్యాటింగ్.. సన్‌రైజర్స్ లక్ష్యం 165