ETV Bharat / sports

IPL 2021: కోల్​కతాతో మ్యాచ్​.. ఐపీఎల్​లో కోహ్లీ మరో రికార్డు - ఐపీఎల్​లో ఆర్సీబీ గేమ్స్

ఐపీఎల్​-2021(IPL Second Phase 2021) రెండోదశలోని రెండురోజు మరో కీలకపోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం జరగనున్న మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్​కతా నైట్​రైడర్స్​(RCB Vs KKR 2021) జట్లు తలపడనున్నాయి. అయితే ఈ ఐపీఎల్ పోరు​ కోహ్లీకి 200వది కావడం విశేషం.

IPL 2021
IPL 2021
author img

By

Published : Sep 20, 2021, 7:24 AM IST

Updated : Sep 20, 2021, 3:45 PM IST

కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్​ రెండో దశ(IPL Second Phase 2021) ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమైపోయింది. తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​-ముంబయి ఇండియన్స్​ తలపడగా.. సోమవారం(సెప్టెంబరు 20) రెండో మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్​కతా నైడ్​రైడర్స్(RCB Vs KKR 2021) జట్లు​ తలపడనున్నాయి.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(Royal Challengers Bangalore).. ఈ సీజన్​ తొలి దశలో అద్భుతంగా రాణించి అభిమానులను ఉత్సాహపరిచింది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో(10 పాయింట్లు)(IPL Points Table) మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడదే జోరుతో రెండో దశలోనూ ప్రత్యర్థులను చిత్తు చేయాలనే లక్ష్యంతో బరిలో దిగుతోంది.

ఆర్సీబీ బ్యాటింగ్​ విభాగంలో కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(Virat Kohli), ఏబీ డివిలియర్స్ , ​దేవదత్​ పడిక్కల్​, ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​తో బలంగానే ఉంది. అయితే గత కొద్దీ కాలంగా నెమ్మదిగా ఆడుతున్న విరాట్​ ఈ సారి ఎలా రాణిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఆర్సీబీ బౌలింగ్​ విభాగంలో మహ్మద్​ సిరాజ్​, కైల్​ జెమీసన్​, హర్షపటేల్​, నవదీప్​ సైనీ, చాహల్​ వంటి ప్లేయర్స్​ పటిష్ఠంగా ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో లీగ్​కు దూరమైన అడం జంపా, కేన్​ రిచర్డ్​సన్​ స్థానంలో శ్రీలంక ప్లేయర్స్​ వానిందు హసరంగ, దుష్మంత చమీరాను తీసుకుంది జట్టు. వీరు ఎలా ప్రదర్శిస్తారో చూడాలి. మొత్తంగా జట్టు సమిష్టిగా రాణిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి.

కోల్​కతా నైట్​రైడర్స్​..

ఇప్పటికే పాయింట్స్​ పట్టికలో(IPL Points Table) చివరి నుంచి రెండోస్థానంలో ఉన్న కేకేఆర్.. ఈ మ్యాచ్​లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. జట్టు బలాబలాలను గమనిస్తే బ్యాటింగ్​ విభాగంలో.. శుభ్​మన్​ గిల్, నితిన్ రాణాల బ్యాటింగ్​ ద్వయంపైనే కేకేఆర్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకూ కేకేఆర్ ఆడిన ఏడు మ్యాచుల్లో గిల్ 132 పరుగులు చేయగా.. రానా 201 పరుగులు సాధించాడు.

మరో బ్యాట్స్​మెన్ కేకేఆర్ సారథి మోర్గాన్ బ్యాట్​తోనూ మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఉంది. అయితే వీరు విఫలమైతే మిడిల్​ ఆర్డర్​లో బ్యాటింగ్​కు వచ్చే వచ్చే దినేష్ కార్తీక్, ఆండ్రూ రస్సెల్, రాహుల్ త్రిపాఠి, షకీబుల్ హసన్​లు రాణించాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్ బాధ్యత ఎక్కువగా టిమ్ సౌథీ, పాట్ కమిన్స్ భుజాలపైనే ఉంది. మొత్తంగా కేకేఆర్-ఆర్‌సీబీ తలపడిన 28 మ్యాచ్​ల్లో 18 విజయాలతో కోల్​కతాకు మెరుగైన రికార్డు ఉంది.

చివరిగా.. 2014 టైటిల్‌ పోరులో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలుపొంది(KKR IPL wins) ట్రోఫీ సాధించిన ఘనచరిత్ర కేకేఆర్ సొంతం. మరి రేపటి మ్యాచ్​లో ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే. అయితే ఐపీఎల్​ ట్రోఫీ(IPL Trophy RCB) ఆర్​సీబీకి అందనిద్రాక్షగా ఉంది. టీ-20 ప్రపంచకప్ అనంతరం పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా వైదొలగనున్న ఆర్​సీబీ సారథి కోహ్లీ నుంచి కేకేఆర్ గట్టి పోటీని ఎదుర్కోనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 20, 2021, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.