ఐపీఎల్-2021(IPL 2021) రెండోదశకు ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇటీవలే నిర్ణయం తీసుకుంది. స్టేడియాల్లో 50 శాతం సామర్థ్యంతో అభిమానులకు టికెట్లు జారీ చేయడమే కాకుండా.. యూఏఈ కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఫ్యాన్స్‌కు సూచించింది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా మ్యాచ్‌లకు వేదికలైన(IPL 2021 Stadium List) దుబాయ్, అబుదాబి, షార్జాల్లో పలు నిబంధనలు(Covid-19 Rules in UAE) పెట్టింది.
మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియాల్లోకి వచ్చే అభిమానులు 48 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని నిర్వాహకులు తెలిపారు. కానీ, రెండు డోసులు తీసుకున్నట్లు వ్యాక్సిన్(2 Doses of Covid Vaccine) ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. స్టేడియాల్లో సీటు సీటుకు మధ్య భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. అయితే 12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న వారికి ఈ నిబంధన వర్తించదు. టికెట్లను(IPL 2021 Tickets) మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా.. స్టేడియాల బయట స్కానింగ్ చేస్తే సరిపోతుంది.
షార్జాలో అలా..
అయితే షార్జాలో మాత్రం కొన్ని నిబంధనలు(Covid-19 Rules Sharjah) వేరుగా ఉన్నాయి. షార్జా స్టేడియంలో మ్యాచ్ చూడాలంటే కచ్చితంగా 16 ఏళ్లు దాటిన వారినే అనుమతించనున్నారు. దీంతో పాటు రెండు డోసుల వ్యాక్సినేషన్ పత్రాలు కావాల్సి ఉంది. 48 గంటల్లోపు ఆర్టీ-పీసీఆర్ కొవిడ్ రిపోర్ట్ ప్రేక్షకులు తమతో తీసుకురావాల్సిఉంది. దానితో పాటు మొబైల్స్‌లో అల్ హోస్న్ యాప్‌ను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి.
అబుదాబి స్టేడియంలో ఇలా..
అబుదాబి స్టేడియానికి(Covid-19 Rules Abu Dhabi) వచ్చే ప్రేక్షకులకు కచ్చితంగా రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకుంటేనే అనుమతి. 48 గంటల్లోపు ఆర్టీ-పీసీఆర్ కొవిడ్ రిజల్ట్ రావాల్సింది. 12-15 ఏళ్ల వయసున్న వారు వ్యాక్సినేషన్ పత్రాలు లేకపోయినా.. కొవిడ్ రిపోర్ట్ తప్పనిసరి.
కానీ, ఐపీఎల్ నిర్వహించనున్న ఈ మూడు వేదికల్లో మాస్క్ ధరించడం.. భౌతికదూరాన్ని పాటించడం వంటి వాటిని ఫ్యాన్స్ తప్పనిసరిగా పాటించాలి. స్టేడియం గేట్ల వద్ద శరీర ఉష్ణోగ్రతను కొలిచే పరికరాలుంటాయి. ఒక్కసారి స్టేడియం నుంచి బయటకు వస్తే.. మళ్లీ లోపలికి వెళ్లేందుకు వీలుండదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2021) రెండో దశ ఆదివారం(సెప్టెంబరు 19) నుంచి పునఃప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్(CSK Vs MI 2021) జట్లు తలపడనున్నాయి.
ఇదీ చూడండి.. IPL 2021 News: 'ఐపీఎల్ ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం'