ETV Bharat / sports

IPL 2021: ఆర్సీబీపై సీఎస్కే విజయం.. అగ్రస్థానం కైవసం - csk won the match

ఐపీఎల్ 2021లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్​తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. 6 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

ipl
ఐపీఎల్​
author img

By

Published : Sep 24, 2021, 11:11 PM IST

ఐపీఎల్ 2021 రెండో దశలో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెకండ్ ఫేజ్ తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ను చిత్తుచేసిన సీఎస్కే.. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్కేకు శుభారంభం లభించింది. గత మ్యాచ్​లోని ఫామ్​ను కొనసాగిస్తూ 38 పరుగులతో ఆకట్టుకున్నాడు గైక్వాడ్. ఇతడికి మద్దతుగా నిలిచాడు డుప్లెసిస్ (31). వీరిద్దరూ తొలి వికెట్​కు 71 పరుగులు జోడించారు. అనంతరం ఇదే స్కోర్ వద్ద ఇద్దరూ పెవిలియన్ చేరారు. తర్వాత కుదురుగా ఆడుతున్న మొయిన్ అలీ (23)ని పెవిలియన్ చేర్చాడు హర్షల్ పటేల్. తర్వాత రైనా, ధోనీ లాంఛనాన్ని పూర్తి చేశారు.

శుభారంభం దక్కినా..!
ఈ మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు కోహ్లీ, పడిక్కల్​ శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ బౌండరీలు బాదడమే లక్ష్యంగా ఆడారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి దాటికి తొలి పవర్​ప్లేలో 55 పరుగులు సాధించింది ఆర్సీబీ. ఆ తర్వాత కూడా వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదారు. దీంతో 11 ఓవర్లలోనే స్కోర్ 100కు చేరింది. ఈ క్రమంలోనే కోహ్లీ ఐపీఎల్​లో 41వ, పడిక్కల్ 6వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. కానీ కాసేపటికే కోహ్లీ (53) బ్రావో బౌలింగ్​లో బౌండరీ వద్ద క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా తొలి వికెట్​కు 111 పరుగుల వద్ద బ్రేక్ పడింది. సీఎస్కేపై ఆర్సీబీ ఓపెనర్లకు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం గమనార్హం.

ఆ తర్వాత వచ్చిన డివిలియర్స్ (12) శార్దుల్ ఠాకూల్ బౌలింగ్​లో భారీ సిక్సు బాది ఊపు మీద కనిపించాడు. కానీ తర్వాత బంతికే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్​గా వెనుదిగిరిగాడు. అనంతరం పడిక్కల్​(70)ను కూడా బోల్తా కొట్టించాడు శార్దూల్. దీంతో స్కోర్ బోర్డ్ నెమ్మదించింది. చివర్లో ఆదుకుంటారనుకున్న మ్యాక్స్​వెల్ (11), టిమ్ డేవిడ్ (1) కూడా విఫలమయ్యారు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులకు పరిమితమైంది.

ఇదీ చూడండి: పడిక్కల్, కోహ్లీ మెరుపులు.. చెన్నై లక్ష్యం 157

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.