Shubman Gill IPL Records : ఓ సునీల్ గావస్కర్, ఓ సచిన్ తెందుల్కర్, ఓ విరాట్ కోహ్లి.. ఇలా టీమ్ ఇండియా క్రికెట్ చరిత్రలో ఒక్కో తరానికి ఒక్కో బ్యాటింగ్ సూపర్ స్టార్ వచ్చారు. అయితే ఇప్పుడు 23 ఏళ్ల శుభ్‌మన్ గిల్.. అదే బాటలో సాగుతున్నాడు. ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తొలి ఏడాదే గుజరాత్ విజేతగా నిలిచిందన్నా.. ఈ ఏడాది రన్నరప్ అయిందన్నా.. అందుకు ప్రధాన కారణం ఈ 23 యంగ్ ప్లేయరే. ఈ ఐపీఎల్ భారత క్రికెట్లో.. గిల్ శకానికి శ్రీకారం చుట్టిందనే చెప్పొచ్చు!
మూడు శతకాలు.. 890 పరుగులు.. ఈ ఐపీఎల్ సీజన్ 16లో గుజరాత్ జట్టులో మరే ఇతర బ్యాటర్ అతని పరుగుల్లో సగం కూడా చేయలేదు. టైటాన్స్ ప్రదర్శనలో శుభ్‌మన్ గిల్ ఎంతటి కీలకమో చెప్పేందుకు ఈ గణాంకాలు చాలు. తన ప్రదర్శనతో జట్టుకు సూపర్ స్టార్ అయ్యాడు.. జట్టుకే కాదు ఐపీఎల్ సీజన్‌కు ఇతనే స్టార్. బ్యాటింగ్‌లో అన్నీ తానై జట్టును ముందుకు నడిపించాలన్నా.. సెంచరీలు కొట్టి స్టేడియంను అదరగొట్టాలన్నా.. అది గిల్‌కే సాధ్యం. గత మ్యాచ్‌ల్లో లాగానే భారీ స్కోరు చేయకపోయినా.. ఫైనల్లోనూ అతను ఉపయుక్తమైన ఇన్నింగ్సే ఆడాడని చెప్పాలి. ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న గిల్.. ఐపీఎల్‌లోనూ తన దూకుడును కొనసాగించి.. క్రికెట్లో తనకు తిరుగులేదని చాటాడు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఈ స్టార్ ప్లేయర్, బలహీనతలను అధిగమించి రాటుదేలాడు.
-
It begins now 💙⚡️ pic.twitter.com/8Iwe0bRFJx
— Shubman Gill (@ShubmanGill) May 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">It begins now 💙⚡️ pic.twitter.com/8Iwe0bRFJx
— Shubman Gill (@ShubmanGill) May 21, 2023It begins now 💙⚡️ pic.twitter.com/8Iwe0bRFJx
— Shubman Gill (@ShubmanGill) May 21, 2023
2018 అండర్-19 ప్రపంచకప్‌లో 'మ్యాన్ ఆఫ్ ద టోర్నీ'గా భారత్ విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించిన ఈ 23 ఏళ్ల స్టార్.. అదే ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఐపీఎల్‌లోనూ అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శనను కనబరిచాడు. అప్పటి నుంచి ఐపీఎల్‌లో ఫామ్‌లో ఉన్న గిల్.. 2020, 2021 సీజన్లలోనూ నిలకడగా రాణించి 400కు పైగా పరుగులను సాధించాడు. కానీ స్ట్రైక్ రేట్ చూస్తే మాత్రం 120 లోపే ఉంది. దీంతో వేగంగా ఆడాల్సిన టీ20ల్లో గిల్ ఇలాంటి స్ట్రైక్‌రేట్ నమోదు చేయడంపై పలు మార్లు విమర్శలు వచ్చాయి. ఇక గుజరాత్ టైటాన్స్‌కు మారడం వల్ల అతని జోరు పెరిగింది. స్ట్రైక్‌రేట్ 130 దాటింది. అయితే ఈ సారి మాత్రం 150కి పైగా స్ట్రైక్‌రేట్‌తో విమర్శకులకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు గిల్. ఈ సీజన్‌లోనే మూడు సెంచరీలు చేశాడు.
ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్ ప్లేయర్స్ ఒక మ్యాచ్‌లోనో లేదా ఒక సీజన్‌లోనో మెరిసి ఆ తర్వాత నిలకడ కోల్పోయి క్రమ క్రమంగా కనుమరుగవుతున్నారు. కానీ గిల్ మాత్రం అలా కాదు. ఒక్క సెంచరీతో సంతృప్తి చెందే ఆటగాడు అయితే కాదతను. తీరని ఆ పరుగుల దాహం అతణ్ని ఇంకా దూరం నడిపిస్తోంది. సంప్రదాయ క్రికెటింగ్ షాట్లతోనే శుభ్‌మన్ పరుగుల వరదను పారిస్తున్నాడు. అతని షాట్ల ఎంపిక, ఆటను అర్థం చేసుకునే విధానం, కింది చేతిని ఉపయోగించే తీరు, బ్యాటింగ్ భారాన్ని భుజాలపై మోస్తూ జట్టును గెలిపించే బాధ్యత, అన్నింటికి మించి క్రీజులో తన ప్రశాంత చిత్తం.. ఇలాంటి అన్ని అంశాలు.. గిల్‌ను మిగతా వాళ్లకంటే ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
కోహ్లీని ఆరాధిస్తూ, అతని ఆట నుంచి నేర్చుకుంటూ ఎదిగిన శుభ్‌మన్.. విరాట్ లాగే నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించి, కుదురుకున్నాక తన జూలును విదిలిస్తాడు. అయితే గిల్ ఆటలో గుడ్డిగా కొట్టే షాట్లు మనకు కనిపించవు. బంతిని సరిగ్గా అంచనా వేసి, కొలిచినట్లుగా కొడతాడు. మరే యువ బ్యాటర్ అయినా వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడంటే.. ఆ ఊపులో తర్వాతి బంతి ఎలా పడినా షాట్ ఆడాలని చూస్తాడు. ఆ క్రమంలో తొందరగా పెవిలియన్ బాట పడుతాడు. కానీ శుభ్‌మన్ అలా కాదు. రెండు షాట్లు కొట్టాక ఓ మంచి బంతి పడితే దాన్ని గౌరవిస్తాడు. డిఫెన్స్ ఆడతాడు. ఈ సంయమనమే మిగతా యువ బ్యాటర్ల నుంచి అతణ్ని వేరుగా నిలుపుతోంది. పరిస్థితులకు తగ్గట్లుగా అతను ఖాళీల్లో నుంచి ఫోర్లు కొట్టగలడు, సిక్సర్ల మోతా కూడా మోగించగలడు.
సన్‌రైజర్స్‌పై ఆడిన 101 పరుగుల ఇన్నింగ్స్‌లో గిల్ కొట్టిన సిక్సర్ ఒకటే. ఫోర్లు 13. అదే ఆర్సీబీ (104 నాటౌట్)పై 8 సిక్సర్లు, ముంబయి (129)పై 10 సిక్సర్లను బాదాడు. గుజరాత్ అగ్రస్థానంతో లీగ్ దశను ముగించిందన్నా.. క్వాలిఫయర్‌లో అలవోకగా ముంబయిని చిత్తు చేసిందన్నా.. అందులో గిల్ పాత్ర అత్యంత కీలకమనే చెప్పాలి. ఫైనల్లోనూ జట్టుకు అతను బలమైన పునాదినే వేశాడు. ప్రపంచ మేటి బౌలర్లు ఆడే ఈ ఐపీఎల్‌లో గిల్ చూపించిన నిలకడ.. అతను కొట్టిన షాట్లు.. ఆడిన భారీ ఇన్నింగ్స్‌లు.. ఇక ప్రపంచ క్రికెట్లో అతడి ఆధిపత్యానికి సూచికలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కోహ్లి తర్వాత రాబోయే తరానికి శుభ్‌మన్ రూపంలో ఓ కొత్త సూపర్ స్టార్ దొరికినట్లే అన్న అంచనాను అతను ఎంతమేర నిజం చేస్తాడో చూడాలి మరి.
అత్యధిక పరుగులు.. ఆరెంజ్ క్యాప్!
ఎప్పటిలాగే ఐపీఎల్ సీజన్ 16లోనూ అదరగొట్టిన శుభ్‌మన్ గిల్.. పలు అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సీజన్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన అతడు.. ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకోవడంతో పాటు.. గేమ్ చేంజర్, టోర్నీలో విలువైన ఆటగాడు లాంటి అవార్డులను గెలుచుకున్నాడు. అత్యధిక ఫోర్ల పురస్కారం సైతం గిల్ ఖాతాలోనే చేరింది. ఇక ఈ సీజన్‌లో ఉత్తమ వర్ధమాన ఆటగాడు అవార్డును యశస్వి జైస్వాల్ (రాజస్థాన్) దక్కించుకున్నాడు. ఫెయిర్‌ప్లే అవార్డు దిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోగా.. అత్యధిక వికెట్లు పడగొట్టిన షమి.. పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.
-
Memorable one pic.twitter.com/2jnfJz6Kqr
— Shubman Gill (@ShubmanGill) May 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Memorable one pic.twitter.com/2jnfJz6Kqr
— Shubman Gill (@ShubmanGill) May 30, 2023Memorable one pic.twitter.com/2jnfJz6Kqr
— Shubman Gill (@ShubmanGill) May 30, 2023