ETV Bharat / sports

IPL 2022: దిల్లీ క్యాపిటల్స్​ కోచ్​లుగా షేన్ వాట్సన్​, అగార్కర్​! - షేన్ వాట్సన్

IPL 2022: ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ అసిస్టెంట్​ కోచ్​గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ షేన్​ వాట్సన్​ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు టీమ్​ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్​ కూడా ఆ జట్టు కోచింగ్​ విభాగంలో చేరనున్నట్లు సమాచారం.

Delhi Capitals
IPL 2022
author img

By

Published : Feb 23, 2022, 11:42 AM IST

IPL 2022: ఐపీఎల్​ 2022లో దిల్లీ క్యాపిటల్స్​ సహాయక కోచ్​గా వ్యవహరించనున్నాడు ఆస్ట్రేలియా మాజీ ఆల్​రౌండర్​ షేన్​ వాట్సన్. లీగ్​ చరిత్రలో వాట్సన్​కు​ ఘన చరిత్ర ఉంది. 3874 పరుగులు, 92 వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. చివరిసారి చెన్నైసూపర్​ కింగ్స్​కు ఆడిన వాట్సన్​.. 2020లో ఫ్రొఫెషనల్​ క్రికెట్​కు గుడ్​బై చెప్పాడు.

అగార్కర్​ కూడా..!

గడిచిన మూడు సీజన్​లలో ప్లేఆఫ్స్​కు అర్హత సాధించిన దిల్లీ క్యాపిటల్స్​.. వాట్సన్​ సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. ఫ్రాంఛైజీ హెడ్​కోచ్​గా ఉన్న ఆసీస్​ మాజీ సారథి రిక్కీ పాంటింగ్​ అతడి పేరును సూచించినట్లు సమాచారం. ఇక వాట్సన్​తో పాటు టీమ్​ఇండియా మాజీ పేసర్​ అజిత్ అగార్కర్​ కూడా దిల్లీ​ కోచింగ్​ విభాగంలో చేరనున్నట్లు తెలుస్తోంది.

బలమైన జట్టుతో బరిలోకి..

ఈ సీజన్​లో దిల్లీకి రిషభ్​ పంత్​ సారథ్యం వహించనున్నాడు. అతడిపై భారీ అంచనాలే ఉన్నాయి. జట్టులో డేవిడ్​ వార్నర్​, పృథ్వీ షా, రోవ్​మన్ పొవెల్, మిషెల్​ మార్ష్​ వంటి హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్​ విభాగంలో అక్షర్ పటేల్, శార్దూల్​ ఠాకూర్​, అన్రిచ్ నోర్జ్​ వంటి వారితో జట్టు పటిష్ఠంగా కనబడుతోంది. ఇక తొలిసారి 10 జట్లు బరిలో నిలవనున్న ఈ టోర్నీ.. మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: IPL 2022: వీరిపై అన్ని కోట్లు ఎందుకు పెట్టారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.