ETV Bharat / sports

ముంబయి విజయంతో ఆర్సీబీలో ఫుల్​జోష్​.. చిందులేస్తూ సంబరాలు - ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్​

IPL 2022 RCB celebrations: కీలక మ్యాచ్​లో దిల్లీపై ముంబయి గెలవడం వల్ల ఆర్సీబీ ప్లేఆఫ్స్​కు చేరింది. దీంతో బెంగళూరు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆటగాళ్లంతా చిందులేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆ వీడియోను చూసేయండి...

IPL 2022 Playoffs RCB Celebrations
ఆర్సీబీ ప్లే ఆఫ్స్​ సెలబ్రేషన్స్​
author img

By

Published : May 22, 2022, 11:56 AM IST

Updated : May 22, 2022, 1:24 PM IST

IPL 2022 RCB celebrations: ఐపీఎల్​లో గతరాత్రి దిల్లీపై ముంబయి గెలవడం వల్ల బెంగళూరు నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్​లో చోటు దక్కించుకుంది. దీంతో ఆ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. శనివారం రాత్రి ముంబయి-దిల్లీల మధ్య పోరు జరుగుతున్నంతసేపు ఉత్కంఠతతో మ్యాచ్​ను తిలకించిన ఆటగాళ్లు.. చివరికి ముంబయి గెలవగానే ఎగిరి గంతులేశారు. ప్రతిఒక్కరూ ఆనందంలో చిందులేశారు. కెప్టెన్​ డుప్లెసిస్​, విరాట్​ కోహ్లీ సహా ప్రతిఒక్కరూ సంబరాలు చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఆర్సీబీ ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

కాగా, ముంబయి చేతిలో దిల్లీ 5 వికెట్ల తేడాతో ఓడింది. మొదట దిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఆ జట్టులో పావెల్‌ (43; 34 బంతుల్లో 1×4, 4×6), పంత్‌ (39; 33 బంతుల్లో 4×4, 1×6) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో బుమ్రా (3/25) విజృంభించాడు. రమణ్‌దీప్‌ (2/29) కూడా మెరిశాడు. ఛేదనలో ముంబయి 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఇషాన్‌ కిషన్‌ (48; 35 బంతుల్లో 3×4, 4×6), డేవిడ్‌ (34; 11 బంతుల్లో 2×4, 4×6) సత్తాచాటారు. దిల్లీ బౌలర్లలో శార్దూల్‌ (2/32), నోకియా (2/37) ఆకట్టుకున్నారు.

ఇదీ చూడండి: పాపం రోహిత్​.. ఇలా జరగడం ఇదే తొలిసారి!

Last Updated : May 22, 2022, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.