ETV Bharat / sports

ఐపీఎల్ వేలం.. చెన్నై, ముంబయి జట్లకు స్పెషల్ టాలెంట్ - చెన్నై సూపర్​కింగ్స్​

IPL 2022 Mega Auction: ఐపీఎల్​ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లు అంటే ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్ గుర్తొస్తాయి.​ అయితే ఐపీఎల్​ వేలంలో ఈ జట్లకు ఏకంగా ఓ స్పెషల్ టాలెంట్ ఉంది. ఇంతకీ అదేంటంటే?

IPL
ఐపీఎల్
author img

By

Published : Feb 11, 2022, 11:17 AM IST

IPL 2022 Mega Auction: ఫిబ్రవరి 12-13 తేదీల్లో జరిగే ఐపీఎల్​ మెగావేలం కోసం క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ ఆటగాడిని ఏ ఫ్రాంఛైజీ ఎంత ధరకు కొనుగోలు చేస్తుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓ ప్లేయర్​ 'మ్యాచ్​ విన్నర్'​ అని భావిస్తే అతడిని ఎన్ని రూ.కోట్లు పెట్టి అయినా సొంతం చేసుకోవాలని భావిస్తుంటాయి ఫ్రాంఛైజీలు. అయితే రూ.కోట్లు కుమ్మరించినా.. జట్టు టైటిల్​ నెగ్గడంలో ఏమాత్రం ప్రభావంచూపని క్రికెటర్లూ ఉన్నారు.

IPL
2021లో నాలుగోసారి ఛాంపియన్​గా సీఎస్​కే

కానీ, ఐపీఎల్​ వేలం చరిత్రలో ఓ ఆటగాడిపై రూ.10 కోట్లకు మించి ఖర్చు పెట్టలేదు ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ జట్లు. అయినప్పటికీ అత్యంత విజయవంతమైన జట్లుగా అవి కొనసాగుతుండటం విశేషం. ఇప్పటివరకు రోహిత్ కెప్టెన్సీలో ముంబయి ఐదు టైటిళ్లు గెలవగా, ధోనీ సారథ్యంలో చెన్నై నాలుగు సార్లు ఛాంపియన్​గా నిలిచింది.

IPL
2020లో ఐదో టైటిల్​దో ముంబయి

వేలంలో చెన్నై అత్యధికంగా రవీంద్ర జడేజాపై రూ.9.72 కోట్లు, ముంబయి.. రోహిత్​పై రూ.9.20 కోట్లు వెచ్చించాయి. అయితే శని, ఆదివారాల్లో జరగబోయే మెగావేలంలో ఈ జట్లు ఈసారైనా రూ.10 కోట్ల మార్కును దాటుతాయేమో చూడాలి?

ఇదీ చూడండి: 'సీఎస్కేకు ధోనీ కెప్టెన్సే కాదు అది కూడా ముఖ్యమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.