ETV Bharat / sports

'ధోనీని చాలా రోజుల తర్వాత కలిశా.. సంతోషంగా ఉంది' - dhoni

IPL 2022 Dhoni Gambhir: టీమ్​ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన ధోనీ, గంభీర్​లు.. ప్రస్తుతం​ ఐపీఎల్​లో వేర్వేరు జట్లలో ఉన్నారు. చెన్నై జట్టుకు ముఖ్య ఆటగాడిగా ధోనీ ఉండగా.. లీగ్​​లో కొత్తగా చేరిన లఖ్​నవూ జట్టుకు గంభీర్​ మెంటార్​గా బాధ్యతలు వ్యవహరిస్తున్నాడు. ఇక, గతరాత్రి ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​ అనంతరం వీరిద్దిరూ​ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ ఫొటోలను చూసి అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

ధోనీ, గంభీర్​
ధోనీ, గంభీర్​
author img

By

Published : Apr 1, 2022, 4:50 PM IST

IPL 2022 Dhoni Gambhir: గతరాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, మ్యాచ్‌ అనంతరం లఖ్‌నవూ మెంటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తన మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని కలిశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ధోనీ, గంభీర్‌ ఒకప్పుడు టీమ్‌ఇండియాకు ఎన్నో విజయాలు అందించారు. ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరూ చెలరేగడంతో భారత్‌ చారిత్రక విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు కలుసుకోవడం ఆసక్తిగా మారింది. దీంతో అభిమానులు సైతం సంబరపడుతున్నారు.

ధోనీ, గంభీర్​
ధోనీ, గంభీర్​
ధోనీ, గంభీర్​
ధోనీ, గంభీర్​

ఇక టీ20లీగ్‌లోనూ కోల్‌కతా కెప్టెన్‌గా గంభీర్‌, చెన్నై సారథిగా ధోనీ పలుమార్లు మైదానంలో ప్రత్యర్థులుగా తలపడ్డారు. వీరి మధ్య వైరం కూడా స్నేహపూర్వకంగానే సాగింది. ఒకానొక దశలో ధోనీ ఈ టోర్నీలో హ్యాట్రిక్‌ విజయాలు సాధించకుండా అడ్డుకుంది కూడా గంభీరే. 2010, 2011లో వరుసగా రెండు సీజన్లు విజేతగా నిలిచిన చెన్నైకి 2012 ఫైనల్లో కోల్‌కతా షాకిచ్చింది. అప్పుడు గంభీర్‌ సారథ్యంలో ఆ జట్టు తొలిసారి కప్పు కైవసం చేసుకుంది. తర్వాత 2014లోనూ కోల్‌కతా మరోసారి టైటిల్‌ విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు గంభీర్‌ ఆటగాడిగా లేకపోయినా లఖ్‌నవూ మెంటర్‌గా కొత్త బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే చెన్నైతో మ్యాచ్‌ అనంతరం ధోనీని కలిసి అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.

ఇదీ చదవండి: లఖ్​నవూ ప్లేయర్ల వినూత్న వేడుకలు​.. గంభీర్​ వింటేజ్​ పంచ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.