సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నాడు. రెండేళ్ల క్రితం ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ.. తమ జట్టు బౌలర్ రషీద్ ఖాన్‌ను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకోవడానికి తమను సంప్రదించిందని అన్నాడు. ఐపీఎల్లో ముంబయి.. విజయవంతమైన జట్టుగా ముందుకెళ్లడానికి గల కారణాన్ని వివరించాడు.
"నాకింకా బాగా గుర్తు.. రెండేళ్ల క్రితం ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ రషీద్ ఖాన్‌ను ట్రేడ్ చేయమని అడిగింది. రషీద్‌ను ట్రేడ్ చేయమని అడగటానికి ఏ జట్టు ధైర్యం చేయలేదు. కానీ ముంబయి ఇండియన్స్ అలా ధైర్యం చేస్తుంది. అందుకే ముంబయి విజయపథంలో దూసుకెళ్తోంది."
-టామ్ మూడీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.
మంగళవారం జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి ఐదోసారి ట్రోఫీని చేజిక్కించుకుంది ముంబయి. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా మరోసారి నిరూపించుకుంది.
ఇదీ చూడండి ఐపీఎల్ 14వ సీజన్లో కొత్త జట్టు.. మెగా వేలం!