ETV Bharat / sports

ఐపీఎల్: అదే నిజమైతే దిల్లీనే ఛాంపియన్! - నాకౌట్ స్టేజిలో దిల్లీ క్యాపిటల్స్ రికార్డు

ఐపీఎల్ తుదిసమరానికి అంతా సిద్ధమైంది. దుబాయ్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్​తో దిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. లీగ్ ప్రారంభం నాటి నుంచి ఈసారి తొలిసారి ఫైనల్​లో అడుగుపెట్టింది దిల్లీ. ఈ క్రమంలో ఆ జట్టు నాకౌట్​ ప్రదర్శనలపై ఓసారి లుక్కేద్దాం.

IPL 2020 Final: Delhi Capitals playoffs record
ఐపీఎల్: అదే నిజమైతే దిల్లీనే ఛాంపియన్!
author img

By

Published : Nov 10, 2020, 3:54 PM IST

దిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ ప్రారంభంలో వరుసగా రెండేళ్లు ప్లేఆఫ్స్ చేరి అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ ఆ తర్వాత సీజన్లలో అస్థిర ప్రదర్శనతో వెనకబడిపోయింది. మళ్లీ 2012లో ప్లేఆఫ్స్ చేరిన జట్టు తర్వాత ఆరేళ్లు అసలు టాప్-5లోనే కనిపించలేదు. దీంతో వాళ్ల పనైపోయిందనుకున్నారు. గతేడాది దిల్లీ డేర్​డెవిల్స్​ పేరును దిల్లీ క్యాపిటల్స్​గా మార్చుకుని మరోసారి సత్తాచాటి, మూడో స్థానంతో సరిపెట్టుకుంది. శ్రేయస్ నాయకత్వంలో ఇప్పుడు తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగే తుదిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్​ ముంబయితో అమీతుమీ తేల్చుకోనుంది.

దిల్లీ వైపే అదృష్టం!

ఐపీఎల్​ జరిగిన ప్రతి లీపు సంవత్సరం​లో కొత్త ఛాంపియన్ రావడం విశేషం.

2008 - రాజస్థాన్ రాయల్స్

2012 - కోల్​కతా నైట్​రైడర్స్

2016 - సన్​రైజర్స్ హైదరాబాద్

2020.. ఇదీ లీపు సంవత్సరం కావడం వల్ల ఈసారి దిల్లీ కొత్త ఛాంపియన్​గా అవతరిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్​లో గెలిస్తే అత్యంత తక్కువ వయసులో టైటిల్ గెలిచిన కెప్టెన్​గా రికార్డు సృష్టిస్తాడు శ్రేయస్ అయ్యర్.

IPL 2020 Final: Delhi Capitals playoffs record
దిల్లీ

నాకౌట్ స్టేజ్​లో దిల్లీ ప్రదర్శన

ఆడిన మ్యాచ్​లు - 8

గెలిచినవి - 2

ఓడినవి -6

నాకౌట్ బ్యాటింగ్ తీరు

అత్యధిక పరుగులు - 189/3 (ఈ ఏడాది​ హైదరాబాద్​తో క్వాలిఫయర్-2 మ్యాచ్​లో)

అత్యల్ప స్కోర్- 87 (2008 సెమీఫైనల్​-1లో రాజస్థాన్ రాయల్స్​పై)

అత్యధిక వ్యక్తిగత స్కోరు - 78* (శిఖర్ ధావన్- ఈ ఏడాది క్వాలిఫయర్​లో సన్​రైజర్స్​పై)

ఎక్కువ పరుగులు - శిఖర్ ధావన్ (5 ఇన్నింగ్స్​ల్లో 118)

అత్యధిక సిక్సులు - 6 (పంత్)

అత్యధిక డకౌట్​లు - 13

ధావన్

నాకౌట్​ బౌలింగ్ తీరు

అత్యధిక వికెట్లు - 4 మ్యాచ్​ల్లో 7 (అమిత్ మిశ్రా)

ఇన్నింగ్స్​లో ఎక్కువ వికెట్లు - 4 (రబాడ, ఈ ఏడాది క్వాలిఫయర్-2లో హైదరాబాద్​పై)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.