ETV Bharat / sports

ఇంగ్లాండ్​లో కోహ్లీ​ వైఫల్యానికి అదే కారణమా? - ఇండియా వర్సెస్​ ఇంగ్లాండ్​

టీమ్​ఇండియా ఎప్పుడు ఇంగ్లాండ్​ వెళ్లినా.. విరాట్​ కోహ్లీ బ్యాటింగ్​ హాట్​టాపిక్​గా ఉంటుంది. 2014లో విఫలమైన కోహ్లీ.. 2018లో విజృంభించి సత్తాచాటాడు. కానీ 2021లో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. సిరీస్​లో కోహ్లీ ఇప్పటివరకు ఔటైన తీరు.. 2014ను తలపిస్తోంది. ఇందుకు ఓ కారణం ఉందంటున్నాడు వీవీఎస్​ లక్ష్మణ్​.

virat
విరాట్​
author img

By

Published : Aug 13, 2021, 7:48 AM IST

Updated : Aug 13, 2021, 12:03 PM IST

క్రీజులోకి రావడం.. ఆఫ్​స్టంప్​ అవతల పడిన బంతిని వెంటాడి మరీ షాట్​కు ప్రయత్నించడం.. అది కాస్తా ఎడ్జ్​ తీసుకుని స్లిప్​లో ఫీల్డర్​కు వెళ్లడం.. తక్కువ స్కోరుకే వెనుదిరగడం.. 2014 ఇంగ్లాండ్​ పర్యటనలో విరాట్​ కోహ్లీ పరిస్థితి ఇది. అందులో నుంచి పాఠాలు నేర్చుకున్న విరాట్​ 2018లో ఆ లోపాన్ని అధిగమించి సత్తాచాటాడు. తాను ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్​మన్​ అని నిరూపించుకున్నాడు. కానీ 2021లో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. రెండు మ్యాచ్​ల్లో.. రెండు సార్లు విరాట్​ ఔటైన తీరు.. 2014 టెస్టు​ మ్యాచ్​లను తలపిస్తోంది. ఇది అభిమానులను కలవరపెడుతోంది. అయితే 2018, 2021 మధ్య విరాట్​ బ్యాటింగ్​లో మార్పులు కనిపిస్తుండటమే ఇందుకు కారణం అంటున్నాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్​.

ఆఫ్​స్టంప్​ తిప్పలు..

తొలి టెస్టులో దారుణంగా విఫలమైన కోహ్లీ(0), రెండో టెస్టులో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడుతున్నట్లే కనిపించాడు. ఇక రెండు మ్యాచుల్లోనూ ఔటైన తీరు కూడా ఒకటే. అయితే క్రీజులో.. ఆఫ్​ స్టంప్​ అవతల కోహ్లీ ఎక్కువ కదులుతుండటమే ఇందుకు కారణం అంటున్నాడు లక్ష్మణ్​.

"ఇంగ్లాండ్​ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్​ వేశారు. లైన్​ అండ్​ లెన్త్​తో తిప్పలు పెట్టారు. ఆఫ్​స్టంప్​ అవతల వేస్తే కోహ్లీ చిక్కుతాడని వాళ్లకి తెలుసు. అక్కడ బంతులేస్తే కోహ్లీకి ఇష్టం లేదని కూడా తెలుసు. ఒక్కోసారి.. బంతి లోపలికి వచ్చి ప్యాడ్లను తాకే విధంగా, ఇంకోసారి బౌన్సర్లు వేస్తూ విరాట్​ను ఇబ్బందికి గురిచేశారు. క్రీజులో విరాట్​ ఎక్కువగా కదులుతుండటం నేను గమనించా. 2018లో ఇలా జరగలేదు. అందుకే తనదైన శైలిలో విరాట్​ షాట్లు ఆడలేకపోతున్నాడు. ఆఫ్​స్టంప్​ అవతల పడే బంతులను వదిలేయాలని ముందుగానే లోలోపాల నిశ్చయించుకున్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్​కు, విరాట్​ క్రీజులో ఎక్కువ కదులుతుండటం బౌలర్లకు కలిసివచ్చింది."

-లక్ష్మణ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

విరాట్​ కోహ్లీ ఆటను కే.ఎల్​ రాహుల్​తో పోల్చాడు లక్ష్మణ్​.

"2018లో విరాట్​ ఎలా ఆడాడో.. రాహుల్​ ఇప్పుడు అలా ఆడుతున్నాడు. రెండు టెస్టుల్లో మంచి ప్రదర్శన చేశాడు. క్రీజులో కదలికలపై విరాట్​ దృష్టి సారిస్తే.. తనదైన శైలిలో మంచి షాట్లు ఆడగలడు. ప్రస్తుతానికైతే.. కోహ్లీ అలా కదులుతుంటే లెగ్​ స్టంప్​ కూడా కనిపిస్తోంది."

లార్డ్స్​ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోహ్లీసేన.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 276పరుగులు చేసింది. రాహుల్​ 127*, రోహిత్​ 83తో అదరగొట్టారు. పుజారా 9 పరుగులకే ఔటయ్యాడు. రాహుల్​తో రహానే(1*) క్రీజులో ఉన్నాడు.

ఇదీ చూడండి:- 'అవును.. ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని!'

Last Updated : Aug 13, 2021, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.