ETV Bharat / sports

ఆదుకున్న శ్రేయస్​, అశ్విన్​.. బంగ్లాతో టెస్ట్​ సిరీస్​ క్లీన్​స్వీప్​ - undefined

india vs bangladesh second test won by team india

author img

By

Published : Dec 25, 2022, 10:56 AM IST

Updated : Dec 25, 2022, 11:13 AM IST

10:55 December 25

ఆదుకున్న శ్రేయస్​, అశ్విన్​.. బంగ్లాతో టెస్ట్​ సిరీస్​ క్లీన్​స్వీప్​

బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్ చేసింది. మిర్పూర్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో మూడు వికెట్ల తేడాతో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి చేధించింది. నాలుగో రోజు విజయానికి 100 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్, జట్టు స్కోరు 56 పరుగుల వద్ద ఉనద్కత్‌ వికెట్‌ను కోల్పోయింది.

కాసేపటికే రిషబ్ పంత్‌, అక్షర్ పటేల్‌ కూడా అవుట్‌ కావడంతో ఫలితంపై ఉత్కంఠ ఏర్పడింది. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమ్​ఇండియాను అశ్విన్‌, శ్రేయస్ అయ్యర్ గట్టెక్కించారు. మరో వికెట్ పడకుండా విజయ తీరాలకు చేర్చారు. అశ్విన్‌ 42, అయ్యర్‌ 29 పరుగులతో అజేయంగా నిలిచారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్‌ మీర్జా 5 వికెట్లతో భారత్‌ను భయపెట్టగా షకీబ్‌ 2 వికెట్లు తీశాడు. అశ్విన్‌, అయ్యర్‌ పట్టుదలగా ఆడి.. జట్టును గెలిపించారు. రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 227 పరుగులకు ఆలౌటైంది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేసి... 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 231 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ ఏడు వికెట్లు కోల్పోయి 145 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.

Last Updated : Dec 25, 2022, 11:13 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.