ETV Bharat / sports

అదేంటి.. టీమ్​ఇండియాకు వైస్​కెప్టెన్​​ అవసరం లేదా? - వైస్​ కెప్టెన్​ పదివపై రవిశాస్రి వ్యాఖ్యలు

టీమ్ఇండియాలో వైస్​కెప్టెన్​ రోల్​పై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో టీమ్‌ఇండియా ఆడే సిరీస్‌లకు వైస్‌కెప్టెన్‌ అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఫామ్​లో లేకపోయినా వైస్​కెప్టెన్​గా ఉంటే జట్టులో కొనసాగాల్సి వస్తోందని చెప్పాడు. దీంతో తుది జట్టు ఎంపిక క్షిష్టతరమవుతోందని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే..

ravi shastri vice captain role
ravi shastri vice captain role
author img

By

Published : Feb 27, 2023, 8:32 AM IST

Updated : Feb 27, 2023, 9:08 AM IST

టీమ్ఇండియాలో వైస్​కెప్టెన్​ రోల్​పై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో ఆడే మ్యాచ్​లకు వైస్​కెప్టెన్​ అవసరం లేదని అన్నాడు. వైస్​కెప్టెన్​ అనే పొజిషన్​ వల్లే జట్టులో కొనసాగుతున్నారని.. దీంతో తుది జట్టును సెలెక్ట్ చేయడం కష్టతరంగా మారిందని చెప్పాడు. కాగా, కొన్ని రోజుల ముందు వరకు టెస్టుల‌తో పాటు వ‌న్డేల్లో కేఎల్​ రాహుల్​ వైస్​ కెప్టెన్​గా కొన‌సాగాడు. ఆ తర్వాత మిగ‌తా రెండు టెస్ట్‌ల‌కు వైస్ కెప్టెన్​గా రాహుల్​ను త‌ప్పించింది జట్టు యాజమాన్యం.

కాగా, ఫామ్​లేమితో విఫలమవుతున్న రాహుల్​ స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌ను ఆడించాలని రవిశాస్త్రి చెప్పాడు. ''రాహుల్‌ ఫామ్‌, మానసిక దృక్పథం గురించి.. శుభ్‌మన్‌ గిల్‌ లాంటి ప్లేయర్​ను ఎలా చూడాలో కూడా తెలుసు. నేనెప్పుడూ భారత జట్టుకు వైస్‌కెప్టెన్‌ను ఉండకూడదనే అనుకున్నా. అత్యుత్తమ తుది జట్టుతో బరిలో దిగాలి. ఒకవేళ టీమ్​ కెప్టెన్‌ మైదానం వీడాల్సి వస్తే అప్పుడు పరిస్థితులను బట్టి మరో ఆటగాడికి బాధ్యతలు ఇవ్వొచ్చు. పరిస్థితులను మరీ కాంప్లెక్స్​గా మార్చకూడదు. నా దృష్టిలో వైస్‌కెప్టెన్‌ హోదా ఉండకూడదు. ఈ విషయంలో నేను మొండిగానే ఉంటా. స్వదేశంలో వైస్‌కెప్టెన్‌ అవసరమే లేదు. విదేశాల్లో అయితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శుభ్‌మన్‌ లాంటి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు కావాలి. జట్టు తలుపులు బద్దలుకొట్టి అతను లోపలికి రావాలి. ఇప్పుడు రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌ కాదు కాబట్టి జట్టు యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకోవాలి." అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

కేఎల్​ రాహుల్‌ గొప్ప ప్లేయరే. కానీ ప్రతిభ ఉంటే సరిపోదు. నిలకడగా మంచి ఫలితాలు రాబట్టాలి. ఇండియాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటను రివ్యూ చేసుకుని, తిరిగి బలంగా రావడానికి రాహుల్‌కు విరామం అవసరం. నేను కోచ్‌గా ఉన్న సమయంలో పుజారా, రాహుల్‌లను తప్పించాం. దీంతో వాళ్లు బలంగా పుంజుకుని మళ్లీ పరుగులు సాధించారు''

--రవిశాస్త్రి, టీమ్​ఇండియా మాజీ కోచ్​

ప్రస్తుతం బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను భారత్‌ 4-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తే.. వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో మానసికంగా పైచేయి సాధించే అవకాశం ఉంటుందని రవిశాస్త్రి అన్నాడు. అయితే, టీమ్​ఇండియా ఇప్పటికే అందులో సగం దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియాపై 2-0 అధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరీస్​ గెలిస్తే జూన్​లో ఇంగ్లాండ్​లోని ఓవల్​ స్టేడియంలో మరోసారి ఆసీస్​తో టీమ్​ఇండియా తుదిపోరులో ఆడనుంది. కాగా, టీమ్‌ఇండియా సిరీస్‌ గెలిస్తే ఇంగ్లాండ్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఆ ప్రభావం ఉంటుంది.. అక్కడి పరిస్థితులు భిన్నంగా ఉంటాయని.. ఆసీస్​ బౌలర్లు పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలో దిగితే అప్పుడు మ్యాచ్‌ పరిస్థితి మారిపోతుందని రవిశాస్త్రి చెప్పాడు. ఇక బుమ్రా, షమి సిరాజ్​ లాంటి బౌలర్లతో వారిని దీటుగా ఎదుర్కోగలరని అన్నాడు. అయితే క్రమశిక్షణ లేకుండా అజాగ్రత్తగా ఆడడం వల్లే కంగారూ ఆటగాళ్లు తొలి రెండు టెస్టుల్లో విఫలమయ్యారని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

Last Updated : Feb 27, 2023, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.