Asia Cup: పొట్టి ప్రపంచకప్ పోటీలకు ముందే టీమ్‌ఇండియాకు మరో సవాలు ఎదురుకానుంది. టీ20 ఫార్మాట్‌లో ఆసియాకప్‌ను నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ పోటీలు జరుగుతాయి. శ్రీలంక వేదికగా ఆసియాకప్ మ్యాచ్‌లు ఏసీసీ నిర్వహించనుంది. దీనికి సంబంధించి వేదికలు, పూర్తిస్థాయి షెడ్యూల్‌ను శనివారం జరిగే వార్షిక సమావేశంలో ఏసీసీ ఖరారు చేయనుంది. ఆసియా కప్ కోసం ఆరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
అయితే పలు కథనాల ప్రకారం.. ఆగస్ట్ 28న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు ఉండనుందని సమాచారం. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఓటమిపాలైన టీమ్‌ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌తోపాటు యూఏఈ, సింగపుర్, కువైట్, హాంగ్‌కాంగ్ దేశాల్లో క్వాలిఫై అయిన జట్టు ఆసియా కప్‌లో తలపడనుంది. ఆసియాకప్ పూర్తి కాగానే.. కేవలం నెల వ్యవధిలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
ఇవీ చదవండి: Malaysia Masters: క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు