IND VS WI 2023 Rohit Sharma : టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం మంచి ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మంచిగా రాణిస్తున్నాడు. తొలి టెస్టులో శతకం బాదాడు. ఇప్పుడు రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలు బాదాడు. దీంతో అతడు ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. వరుసగా 30 ఇన్నింగ్స్‌ల్లో రెండెంకల స్కోరు చేసిన మొదటి బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు.
అంతకముందు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్థనె వరుసగా 29 ఇన్నింగ్స్‌ల్లో డబుల్ డిజిట్ స్కోరు చేశాడు. ఇప్పుడా రికార్డును హిట్ మ్యాన్ క్రాస్ చేశాడు. వెస్టండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు హిట్‌మ్యాన్ డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసీస్‌తో బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. ఇలా వరుసగా టెస్టు మ్యాచుల బరిలోకి దిగాడు. గత 30 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ 12, 161, 26, 66, 25*, 49, 34, 30, 36, 12*, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 15, 46, 120, 32, 12, 12, 35, 15, 43, 103, 80, 57 స్కోర్లు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి.
Rohit Sharma T20 Stats : రోహిత్ ఖాతాలో ఓ చెత్త రికార్డు కూడా ఉంది. అదేంటంటే.. టీ20ల్లో అత్యధిక సార్లు (45) సింగిల్ డిజిట్‌కు పెవిలియన్ చేరిన పేలవమైన రికార్డు కూడా రోహిత్‌దే. ఈ జాబితాలో ఐర్లాండ్ బ్యాటర్ కెవిన్ ఒబ్రెయిన్ (44), బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ (41)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే మరోవైపు అదే టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత కూడా హిట్‌మ్యాన్‌దే. అతడు 148 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో నాలుగు శతకాలతో టాప్‌లో ఉన్నాడు.
యశస్వి జైశ్వాల్‌తో.. ఇక రోహిత్ శర్మ.. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలను నమోదు చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి వెస్టిండీస్‌పై 466 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇంటర్నేషనల్ కెరీర్లో ఇది మూడో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం(రెండు టెస్టుల సిరీస్‌లో). దక్షిణాఫ్రికా ప్లేయర్స్ గ్రేమ్ స్మిత్ - నీల్ మెకంజీ 2008లో బంగ్లాదేశ్‌పై 479 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అత్యుత్తమ యావరేజ్‌తో(53.64) పరుగులు చేస్తున్న ఐదో ఓపెనర్‌గానూ రోహిత్ శర్మ నిలిచాడు.
ఇదీ చూడండి :
IND VS WI 2023 : విండీస్‌తో రెండో టెస్ట్.. టీమ్‌ఇండియా రికార్డులే రికార్డులు..
IND VS WI 2023 : సిరాజ్ దెబ్బకు విండీస్ విలవిల.. పట్టుబిగించిన భారత్