ETV Bharat / sports

IND vs SA Series: టీమ్ఇండియా దక్షిణాఫ్రికా ప్రయాణం అప్పుడే! - డిసెంబర్ 16న దక్షిణాఫ్రికాకు టీమ్ఇండియా

IND vs SA Series: న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్ ముగిశాక టీమ్ఇండియా ఆటగాళ్లకు కాస్త విరామం దొరికింది. దీంతో వారి ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. అయితే త్వరలోనే దక్షిణాఫ్రికాతో సిరీస్​ జరగనుంది. ఇందుకోసం టీమ్ఇండియా ఈనెల 16న సౌతాఫ్రికాకు బయలుదేరనుందని తెలుస్తోంది.

IND vs SA Series latest news, Team India South Africa tour, భారత్ దక్షిణాఫ్రికా సిరీస్, టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన
IND vs SA Series
author img

By

Published : Dec 12, 2021, 1:31 PM IST

IND vs SA Series: న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​లో విజయం సాధించిన టీమ్ఇండియాకు కాస్త విరామం దొరికింది. అయితే త్వరలోనే భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఆ దేశంలో డిసెంబర్ 26న జరగబోయే తొలి టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు ఈ నెల 16న సౌతాఫ్రికాకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందే ఆదివారం ముంబయి చేరుకుని క్వారంటైన్​లో ఉండనున్నారు. ఆ తర్వాత సౌతాఫ్రికా వెళ్లి బయోబబుల్​లోకి ప్రవేశిస్తారు. టెస్టు సిరీస్ ముగిసేవరకు వారు బబుల్​లోనే ఉండనున్నారు.

ఈ టెస్టు సిరీస్​ కోసం 18 మందితో కూడిన జట్టును ఇప్పటికే ప్రకటించింది టీమ్ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ. వన్డే సిరీస్ కోసం రెండు, మూడు రోజుల్లో జట్టును ప్రకటించనున్నారు. డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. జనవరి 3-7 వరకు రెండో టెస్టు, 11-15 వరకు మూడో టెస్టు నిర్వహించనున్నారు. అనంతరం మూడు వన్డేల సిరీస్​లో తలపడతాయి ఇరుజట్లు.

ఇవీ చూడండి: మారియా కిరిలెంకో.. ఈ టెన్నిస్ భామ చాలా హాట్ గురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.