IND Vs SA: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో రెండో స్థానం సాధించాడు. సౌతాఫ్రికాతో మూడో టెస్టులో ఈ రికార్డు నెలకొల్పాడు విరాట్.
ఈ జాబితాలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్(15 మ్యాచ్‌ల్లో 1161పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ద్రవిడ్(11 టెస్టుల్లో 624పరుగులు) ఉండేవాడు.
అయితే సౌతాఫ్రికాలో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన కోహ్లీ.. 50కుపైగా సగటుతో 688పరుగులు చేశాడు. రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడోటెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 223 పరుగులకే ఆలౌటైంది. కోహ్లీ(79; 201బంతుల్లో 12x4,1x6)జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పుజారా(43), పంత్(27) ఫర్వాలేదనిపించారు. రహానే(9), అశ్విన్(2), శార్దూల్ ఠాకూర్(12) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 77 ఓవర్లలో 223 పరుగులు చేసింది భారత్.
తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 8 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మహారాజ్(6), మార్క్రమ్(8) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఓ వికెట్ తీశాడు.
ఇదీ చూడండి: IND Vs SA: తొలిరోజు ఆట పూర్తి.. దక్షిణాఫ్రికా స్కోరు 17/1